ఆంధ్రప్రదేశ్‌

కొత్త పొత్తుల కోసం చంద్రబాబు తహతహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 24: గ్రాఫ్ పడిపోతోందనే భయంతోనే చంద్రబాబునాయుడు కొత్త పొత్తుల కోసం ఎత్తులువేస్తూ కర్నాటకం అడారని వైసీపీ ఎంపీ, పార్లమెంటరీ పక్ష చీఫ్ విప్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. కొత్త పొత్తుల కోసం వెంపర్లాడుతూ రాహుల్ కలయికతో కాంగ్రెస్‌తో పొత్తుకు చంద్రబాబునాయుడు తహతహలాడారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర సన్నాహక సమావేశానికి రాజమహేంద్రవరం వచ్చిన ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పొత్తుల్లేకుండా చంద్రబాబు ఎపుడూ పోటీ చేయలేదన్నారు. వైసీపీని బీజేపీ వెనుక ఉండి ఆడిస్తోందని చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ నెల 29న కలవాల్సిందిగా తమ పార్టీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ నుంచి పిలుపు వచ్చిందని, పార్లమెంటరీ పక్ష చీఫ్ విఫ్‌గా తనకూ ఫోన్ వచ్చిందన్నారు. 29వ తేదీ సాయంత్రం తమ పార్టీ ఎంపీలంతా స్పీకర్‌ను కలిసి, తమ రాజీనామాలు ఆమోదించాలని కోరతామన్నారు. ఇప్పటికే అనేకసార్లు తమ రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్‌చేశామన్నారు. రాజీనామాలు ఆమోదించకపోయినా ఇకపై పార్లమెంట్‌కు వెళ్ళేది లేదని, ఇప్పటికే గత నెల రోజులుగా ఎంపీల ప్రోటోకాల్‌ను కూడా త్యజించామన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ కట్టుబడి ఉందన్నారు.వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలను నెగ్గించుకున్న తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఎవరు పనిచేస్తారో వారితో కలవడానికి ఆలోచన చేస్తామని ఇప్పటికే తమ అధినేత చెప్పారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చాలని, ముఖ్యమంత్రి తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించుకోవాలని సుబ్బారెడ్డి డిమాండ్‌చేశారు. రమణ దీక్షితులు ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలన్నారు.