ఆంధ్రప్రదేశ్‌

పోలీసులకూ వీక్లీ ఆఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, మే 24: రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీసులకు వారంతపు సెలవులపై చర్చిస్తున్నామని, త్వరలో ఒక నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప వెల్లడించారు. గురువారం సాయంత్రం చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మోడరన్ పోలీస్ స్టేషన్‌ను సకల సౌకర్యాలతో నిర్మిస్తున్నామని తెలిపారు. పోలీసుశాఖలో ఆధునిక టెక్నాలజీ వాడుతుండడంవల్ల నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. త్వరలో తిరుపతి అర్బన్ ఎస్‌పి కార్యాలయాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతామన్నారు. ఉద్దానం సమస్యపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్థీగ్యాంగు, చెడ్డి గ్యాంగులపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దన్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేసామని, మహిళా కేసులు పరిష్కారానికి మహిళా డీఎస్పీలను నియమించామన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రవేశ పెట్టిన సీపీఓ వ్యవస్థ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. గురువారం చిత్తూరు, గంగాధరనెల్లూరు,వెదురుకుప్పం పోలీసుస్టేషన్లను ప్రాంరభించారు
ఇదిలావుండగా పోలీసుస్టేషన్ల ప్రారంభోత్సవం అనంరతం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికే స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదన్నారు. కర్నాటకలో నూతన ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి జేడీఎస్ నేతల ఆహ్వానం మేరకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెళ్లారని చెప్పారు.
రమణ దీక్షితులుపై విమర్శలు
శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో పనిచేసి ఆయన పవిత్రతను, ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న ఆలయ మాజీ ప్రధానార్చకులు ఒక విద్రోహ శక్తి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖామంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో నూతనంగా ఏర్పాటుచేసిన వెస్ట్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టడానికి కొన్ని శక్తులు రమణదీక్షితులను వాడుకుంటున్నాయన్నారు.

చిత్రం.. వెదురుకుప్పం పోలీసుస్టేషన్ ప్రారంభోత్సవ
సభలో మాట్లాడుతున్న హోం మంత్రి చినరాజప్ప