ఆంధ్రప్రదేశ్‌

టీటీడీ వ్యవహారాలపై విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 25: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో చోటుచేసుకుంటున్న సంఘటనలపై అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. విశాఖలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంప్రదాయ ప్రకారం వస్తున్న శ్రీవారి నైవేధ్యాల తయారీ కేంద్రం పోటులో తవ్వకాలు, స్వామివారి విలువైన ఆభరణాల్లో రుబీ (గులాబీ రంగు రాయి) మాయం, ఆపై జేనీవాలో వేలం వంటి ఆరోపణలు, శ్రీవారి సేవలకు అంతరాయం వంటి అంశాలు భక్తుల మనోభావలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. టీడీపీ అధికారంలోకి రాకపూర్వం టీటీడీ ధార్మిక మండలి పనిచేసేదని, చంద్రబాబు సీఎం అయిన తరువాత ధార్మిక మండలిని ఎందుకు పునరుద్ధరించలేదని ప్రశ్నించారు. దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దైవ సన్నిధిలో భవవంతునికి సేవ చేసుకునే అర్చకులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావడం అత్యంతదారుణమైన విషయంగా పేర్కొన్నారు. రమణ దీక్షితులు ఆరోపణల వెనుక బీజేపీ హస్తం అంటూ టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు.