ఆంధ్రప్రదేశ్‌

జూన్ 5నుండి ఏపీ టెట్ హాల్‌టికెట్‌ల డౌన్‌లోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 25: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్‌టికెట్‌లు జూన్ 5వతేదీ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టెట్ కన్వీనర్ ఎ సుబ్బారెడ్డి తెలిపారు. 10 నుండి 19వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలతో కలిపి 81 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. దరఖాస్తు సమర్పణకు గడువు ముగియడంతో జూన్ 5వతేదీ నుండి హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. శ్రీకాకుశంలో 3సెంటర్లు, విజయనగరంలో 2సెంటర్లు, విశాఖపట్నంలో 8, పశ్చిమగోదావరిలో 3, తూర్పుగోదావరిలో 3, కృష్ణాలో 5, గుంటూరులో 10, ప్రకాశంలో 3, నెల్లూరులో 1, చిత్తూరులో 8, తమిళనాడులో 2, కడపలో 10, అనంతపురంలో 6, బెంగుళూరులో 6, కర్నూలులో 8, హైదరాబాద్‌లో 3 పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశామని సుబ్బారెడ్డి తెలిపారు. పరీక్ష రోజుకు రెండు సెషన్లలో జరుగుతుందని, ఉదయం 9.30గంటల నుండి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 3,97,957 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా పేపర్-1కు 1,69,085 మంది హాజరవుతుండగా 10, 11, 12 తేదీల్లో రెండు సెషన్లలో, 13వతేదీ మాత్రం ఉదయం సెషన్‌లో పరీక్ష జరుగుతుందన్నారు. పేపర్-2ఎ (సోషల్)కు 66,063 మంది హాజరవుతుండగా 14వతేదీ రెండు సెషన్లు 15వతేదీ ఉదయం సెషన్ పరీక్ష జరుగుతుందని, పేపర్-2ఎ (మ్యాథ్స్, సైన్స్)కు 76,180 మంది హాజరవుతుండగా 15వతేదీ మధ్యాహ్నం సెషన్, 17వతేదీ రెండు సెషన్స్ పరీక్ష ఉంటుందని, పేపర్-2ఎ ల్యాంగ్వేజ్ టీచర్లకు 70,484 మంది హాజరవుతుండగా 18వతేదీ రెండు సెషన్లలో 19వతేదీ ఉదయం సెషన్‌లో పరీక్ష జరుగుతుందన్నారు. పేపర్-2బి పీఈటీలకు 16,145 మంది దరఖాస్తు చేసుకోగా 19వతేదీ రెండు సెషన్లలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 3,97,957 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. టెట్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని ఆయన స్పష్టం చేశారు.