ఆంధ్రప్రదేశ్‌

హెల్త్ యూనివర్శిటీలో పూర్తి స్థాయి కంప్యూటరీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలోని అన్ని విభాగాలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సీవీ రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ తమ యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరగబోయే పరీక్షలకు విచ్చేసే ఇన్విజిలేటర్లకు ఓపెన్ టెండర్ల ద్వారా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. పీజీ విద్యార్థులకు హాజరు 80 శాతం కంటే తక్కువగా ఉంటే వారిని పరీక్షలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. నూతనంగా బీఎస్సీ (పారా మెడికల్) కోర్సును ప్రారంభిస్తున్నామన్నారు. అన్ని విభాగాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ ఇవ్వాలని ఆలోచిస్తున్నామన్నారు. విద్యార్థుల ఉత్తీర్ణతా పత్రాలను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే బార్ కోడ్ పద్ధతిలో ఇస్తున్నామన్నారు. విజయవాడ, తిరుపతిలో రీజనల్ టీచర్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.