ఆంధ్రప్రదేశ్‌

నిలిచిపోయిన భూసేకరణ బిల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 27: పోలవరం భూసేకరణ బిల్లులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి. బిల్లులు చెల్లించే నూతన సాంకేతిక విధానంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల గత రెండు నెలలుగా బిల్లులు మంజూరు కావడం గానీ, లబ్ధిదారులకు చెల్లింపులు గానీ జరగడం లేదని తెలుస్తోంది. పోలవరం భూసేకరణ నిమిత్తం ఇంకా రూ.6892.70 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు 1,65,431 ఎకరాల భూమి అవసరం కాగా ఇంకా 61,440 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుత అంచనా ప్రకారం రూ.6892.70 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు సేకరించిన భూములకు సంబంధించి నష్టపరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత రెండు నెలల నుంచి బిల్లులు జారీ కావడం లేదు. ఏప్రిల్, మే మాసాల్లో ఎటువంటి బిల్లుల చెల్లింపులు జరగలేదంటున్నారు. ఇప్పటి వరకు రూ.4234.17 కోట్ల చెల్లింపులు జరిగాయి. 1,03,991 ఎకరాల భూమి సేకరించారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో హెడ్ వర్క్సు, ఎడమ ప్రధాన కాలువ, దేవీపట్నం మండలంలో ముంపు భూములకు సంబంధించి మొత్తం 15,653 ఎకరాలు సేకరించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో మొత్తం భూమిని సేకరించారు. కానీ ఇంకా రూ.86.47 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. గత రెండు నెలల నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. భూమికి భూమిగా 20,525 ఎకరాలకుగాను ఇప్పటి వరకు 196 ఎకరాల వరకు ఇచ్చారు. ఇందుకోసం ఇప్పటి వరకు రూ.6.09 కోట్లు ఖర్చయింది. ఇంకా 19802 ఎకరాలు భూమికి భూమిగా సేకరించి ఇవ్వాల్సి ఉంది. ఇందు కోసం ఇంకా రూ.2045 కోట్లు బిల్లులు రావాల్సి ఉంది. ఆర్ అండ్ ఆర్ కాలనీలకు సంబంధించి ఇంకా రూ.588 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఖమ్మం జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లాలో కలిసిన ముంపు మండలాలకు సంబంధించి మొత్తం 64,818 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ నాలుగు మండలాల్లో ఇంకా 32,066 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందుకు సుమారు రూ.3715 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో భూమికి భూమి, ఆర్ అండ్ ఆర్ కాలనీలు, ఖమ్మం జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన ముంపు మండలాలకు సంబంధించి మొత్తం సుమారు రూ.2967 కోట్లు ఖర్చయింది. ఇంకా సుమారు రూ.456 కోట్లు విడుదల కావాల్సి ఉంది.