ఆంధ్రప్రదేశ్‌

అధికార కేంద్రీకరణతో అవినీతి:ఐవైఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 27: రాష్ట్రంలో అధికార కేంద్రీకరణ జరిగితే అవినీతి పెచ్చుమీరుతుందని టీటీడీ మాజీ ఈఓ, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఫౌండేషన్ ఫర్ సోషియల్ అవేర్నస్, జనచైతన్య వేదికల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో అధికార వికేంద్రీకరణ, రాజకీయాల్లో సామాజిక న్యాయం అనే అంశాలపై చర్చా కార్యక్రమం జరిగింది. అలాగే ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘రాజధాని అమరావతి’ పుస్తకావిష్కరణ జరిగింది. ముందుగా ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తకాన్ని మాజీ శాసనసభా స్పీకర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఐవైఆర్, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ప్రసంగించారు. ముందుగా ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు స్థానిక సంస్థల నుంచి పైవరకు సామర్ధ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారుల సామర్ధ్యాన్ని పెంచడానికి బదులుగా గత 40, 50 సంవత్సరాలుగా గండి కొడుతూనే ఉన్నారన్నారు. ఎమ్మెల్యేనే అన్నింటికీ కేంద్ర బిందువుగా చేసి అక్కడే అధికారం కేంద్రీకృతమయ్యేలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1వ తేదీనే జరపాల్సి ఉందని సూచించారు.
రాజుల పాలనను తలపిస్తోన్న బాబు
రాష్ట్రంలో బాబు పాలన రాజుల పాలనను తలపిస్తోందని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ సీఎం ఎన్‌టి రామారావు బీసీల్లో చైతన్యం తీసుకువచ్చారని, వారికి చేయూత ఇచ్చారన్నారని చెప్పారు. నేడు బీసీలను వాడుకుంటున్నారే తప్ప వారికి చేసింది ఏమీలేదన్నారు. ఇప్పుడు ఎన్నికలొస్తే బాబు ఓడిపోవడం తథ్యమన్నారు. బాబు ఇంతగా చెడిపోవడానికి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి కారణమని జస్టిస్ ఈశ్వరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
భూముల ధరలు పెంచుకున్నారు
రాష్ట్ర రాజధాని పేరుతో వేలాది ఎకరాలను సేకరించడాన్ని నిపుణులు వద్దన్నా ప్రభుత్వం భూములు సేకరించి, తమ వారి భూములకు అధిక ధరలు పలికేలా చేసుకుని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి మండిపడ్డారు. నేడు సామాజిక న్యాయం జరగడం లేదన్నారు. రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు.