ఆంధ్రప్రదేశ్‌

వరద నీటి నుండి బయటపడిన డయాఫ్రం వాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూన్ 17: గోదావరి వరద నీటి మట్టం స్వల్పంగా తగ్గడంతో డయాఫ్రం వాల్ ప్రాంతంలో ఉన్న రోడ్డు ఆదివారం నీటి నుండి బయటపడింది. శనివారం ఉద్ధృతంగా వరద నీరు పెరగడంతో డయాఫ్రం వాల్ ప్రాంతం నీట మునిగింది. గోదావరి నీటిమట్టం పెరగడంతో శనివారం పట్టిసం ఎత్తిపోతల పథకంలోని నాలుగు మోటార్లు ఆన్‌చేసి కుడి కాల్వ ద్వారా గోదావరి నీటికి కృష్ణాడెల్టాకు తరలించిన విషయం విదితమే. ఆదివారం మరో నాలుగు మోటార్లు ఆన్‌చేసి రోజుకు 2,800 క్యూసెక్కుల నీటిని కృష్ణాడెల్టాకు తరలిస్తున్నామని ఎస్‌ఈ రమేష్‌బాబు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో జెట్ గ్రౌటింగ్ పనులు 2,050 మీటర్ల పొడవున చేయాల్సి ఉండగా 144 మీటర్ల పని మిగిలి ఉందని, దిగువ కాఫర్ డ్యాం నిర్మాణ ప్రాంతం వద్ద 319 మీటర్ల పొడవునా పని చేయాల్సి ఉందని డీఈ శివశంకర్ తెలిపారు. గోదావరికి వరద వచ్చినప్పటికీ జెట్ గ్రౌటింగ్ పనులకు అంతరాయం కలుగలేదని, నెలాఖరుకు ఆ పనులు పూర్తిచేస్తామని డీఈ తెలిపారు.

చిత్రం..డయాఫ్రం వాల్ ప్రాంతంలో వరద నీటి నుండి బయటపడిన రోడ్డు