ఆంధ్రప్రదేశ్‌

పోలవరంపై టీడీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: పోలవరంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని, దానిని తిప్పికొట్టాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు, కర్నాటక ఇన్‌ఛార్జి దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు. పోలవరం సందర్శన నిమిత్తం ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సారధ్యంలో బీజేపీ బృందంలో వచ్చిన ఆమె ఆదివారం రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ పోలవరాన్ని అడ్డుకుంటోందనే టీడీపీ ప్రచారాన్ని మానుకోవాలని విమర్శించారు. ఏపీ అధ్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారిగా పోలవరాన్ని సందర్శించడం జరుగుతోందన్నారు. పోలవరం పనుల వివరాలను తెలియజేసేందుకే బీజేపీ సందర్శన అన్నారు. పోలవరం ఏపీకి మోదీ వరం అన్నారు. పోలవరం ఏపీకి దీర్ఘకాలిక స్వప్నమని, జీవనాడి, జీవధార అయిన ఈ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలనే ఎన్డీయే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడు ముంపు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రంలో విలీనం చేసి పోలవవరం కోసం కృషిచేసి తన చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. ఏపీ ఖర్చు చేసే ప్రతీ పైసా కేంద్రమే భరిస్తోందన్నారు. ప్రతీ పైసా రీయంబర్స్‌మెంట్ చేస్తుందని, ఇప్పటికీ నయాపైసా బకాయి లేకుండా మొత్తం నిధులన్నీ కేంద్రం చెల్లించినట్టు ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించామన్నారు. పాతరేట్లకే కొత్త సంస్థకు అప్పగించిన నేపధ్యంలో 15 గంటల్లో 8వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని చేసినట్టు చెప్పారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు లేవనెత్తిన అంశాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్ళి అన్ని సమస్యలను పరిష్కరించామన్నారు. సకాలంలో పోలవరం పూర్తిచేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. గోదావరి, కృష్ణా ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్త ఆయకట్టు పోలవరం ద్వారా సాధ్యమని, అందుకే బీజేపీ అంకితభావంతో అన్ని అడ్డంకులను తొలగించుకుని ముందుకెళ్లడం జరుగుతోందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కేంద్రం నుంచి ఎటువంటి జాప్యం లేకుండా ప్రాజెక్టును సత్వరం పూర్తి చేసేందుకు అవసరమైనరీతిలో పనులు పూర్తిచేసి సత్వరం పూర్తయ్యేందుకు, ఎటువంటి అవుట్ స్టాండింగ్ లేకుండా నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తుందన్నారు.