ఆంధ్రప్రదేశ్‌

రైళ్లలో రాత్రివేళ ప్రయాణమంటేనే హడల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాత్రివేళ రైళ్లలో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు హడలిపోతున్నారు. ఇటీవలి కాలంలో తరచూ జరుగుతున్న దోపీడీలను చూసి గత్యంతరం లేని స్థితిలో బెర్త్‌లను ముందుగానే బుక్ చేసుకున్నప్పటికీ కంటిపై కునుకు ఉండటం లేదు. రైళ్లలో దోపిడీ దొంగల స్వైర విహారం చేస్తున్నా పట్టించుకునే నాథులే లేకుండాపోయారు. తాజాగా రాయలసీమలో రాయలసీమ - వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో దుండగులు ఏకంగా మారణాయుధాలతో ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసి నిలువు దోపిడీకి గురిచేశారు. దుండగులు ముందస్తు ప్రణాళికతో జుటూరు - రాయలచెరువు స్టేషన్ వద్ద సిగ్నిల్స్‌ను సైతం ధ్వంసం చేశారు. దీంతో లోకోపైలెట్ రైలును నిలిపివేయటంతో మరుక్షణం దుండగులు బోగీల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించి ప్రతి ఒక్కరినీ దోచుకోవటం రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే సంచలనంగా నిలుస్తోంది. దీనికంతటికీ రైల్వే శాఖ అధికారులు, రైల్వే పోలీసులలో ఎవరు కారణమనేది తేలాల్సి ఉంది.
రైళ్లలో ఒక్క ప్రయాణికుని జోలికి వెళ్లినా ముందూవెనుకా ఆలోచించకుండా కాల్చివేయాలనే శాశ్వత ఉత్తర్వులు ఈ ఘటనల్లో ఏమయ్యాయో అంతుబట్టటం లేదు. నిబంధనల మేర ప్రతి మూడు నాలుగు బోగీలకు కనీసం ఓ ఆర్‌పీఎఫ్ లేదా జీఆర్‌పీ కానిస్టేబుల్ ఎస్కార్ట్‌గా ఉండాల్సి ఉంది. అయితే వాస్తవానికి దాదాపు 29 బోగీలతో నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కంటితడువుగా ఒకరిద్దరు విధులు నిర్వర్తిస్తున్నా వారికి కూడా ఎలాంటి ఆయుధాలు అప్పగించకపోవటం, ఇక ఆ ఇద్దరు కూడా రాత్రి 12దాటితే ఏదో బర్త్‌లో నిద్రకు ఉపక్రమిస్తుండటం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లా ఫిరంగిపురం రైల్వేస్టేషన్ సమీపంలో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో నిలువు దోపిడీ జరిగినప్పటికీ రైల్వే శాఖలో ఎలాంటి అప్రమత్తత కన్పించలేదు. సాధారణంగా మండటెండల కాలంలో ఇలాంటి ఘోరాలు అధికంగా జరుగుతున్నాయి. స్లీపర్ కోచ్ విభాగాల్లో వెలుపలి గాలి కోసం దాదాపు ప్రతిఒక్కరూ కిటికీలు తెరిచి కూర్చుంటారు. మెడలో బంగారు నగలు కన్పించేవారిపై దొంగల కన్ను పడుతోంది. కొందరు దొంగలు రైలు ప్రయాణ సమయంలోనే అలాంటి వారి మెడల్లో బంగారు ఆభరణాలను దొంగలిస్తుంటే.. మరికొందరు మరింత సాహసంతో నిర్మానుష్య ప్రదేశాల్లో రైళ్ల చైన్‌లు లాగి రైళ్లను నిలిపేసి నిలువు దోపిడీకి బరితెగిస్తున్నారు.
అయితే ఇలాంటి సందర్భాల్లో పోలీసుల నిఘా ఏమవుతోందో అర్థంకావటం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం చీరాల సమీపంలో దుండగులు నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ను దోచుకుంటుండగా విధుల్లో ఉన్న పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. దాంతో కొంతకాలం రైళ్లలో దోపిడీలు నిలిచాయి. అయితే ఇటీవలి కాలంలో తుపాకులు లేకుండా బందోబస్తుకు వస్తున్న పోలీసులను చూసి దోపిడీ దొంగలు మరింతగా బరితెగిస్తున్నారు.
నిబంధనల ప్రకారం కొందరు విధుల్లో ఉన్నప్పటికీ అర్ధరాత్రి 12గంటలు దాటడంతోనే ఏదో స్లీపర్ బోగీలో ఖాళీ బెర్త్ చూసుకుని నిద్రకు ఉపక్రమిస్తుంటారు. సికింద్రాబాద్ నుంచి ఎస్కార్ట్‌గా వచ్చే సిబ్బంది ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో పలు రైళ్లు ఎలాంటి ఎస్కార్ట్ లేకుండా రాకపోకలు సాగిస్తున్నాయి. దీనికితోడు టీటీలు పైసలకు కక్కుర్తిపడి ఎలాంటి గుర్తింపు లేకపోయినా అనధికారిక వ్యక్తులను ఏకంగా ఏసీ బోగీల్లోకి కూడా అనుతిస్తున్నారు. దోపిడీలు ఇలావుంటే, ప్రయాణికుల లగేజీకి కూడా ఎలాంటి భద్రత లేకుండాపోతోంది.