ఆంధ్రప్రదేశ్‌

ఉరకలెత్తిన ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 3: ప్రతి నెలా మొదటి ఆదివారం హ్యాపీ సండే పేరుతో నగరంలో నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమాలకు మంచి స్పందన రావడంతోపాటు నగర ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని ఆనందంగా గడుపుతున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ, పోలీస్ శాఖ, శాప్‌తో పాటు డీప్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హ్యపీ సండే కార్యక్రమం పెద్దసంఖ్యలో ఆదరణ లభించడంతో పాటు నగర ప్రజలు ఆదివారాన్ని ఆనందమయంగా గడుపుతున్నారు. బందరు రోడ్డులో చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడంతోపాటు కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్, టెన్నికాయిట్, ఖోఖో, చదరంగం, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడాంశాల్లో పాల్గొని సుమారు రెండు గంటలపాటు ఉత్సాహంగా గడుపుతున్నారు. హ్యాపీ సండే కార్యక్రమంలో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారు సైతం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ అందరూ సుఖ సంతోషాలతో వుండాలనే ఆలోచనలతో హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తద్వారా ఆరోగ్యకరంగా వుండటానికి ఎంతో దోహదపడుతుందన్నారు. శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో మరిన్ని వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలను మమేకం చేసేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్, పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, శాప్ చైర్మన్ పిఆర్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. హ్యాపీ సండేకు భారీ స్పందన