ఆంధ్రప్రదేశ్‌

ఇక 24 గంటలూ టిటిడి కాల్ సెంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 4: శ్రీవారి భక్తులకు అవసరమైన తగు సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం ఇకపై 24 గంటలపాటూ కాల్‌సెంటర్లు అందుబాటులో ఉండేలా టిటిడి ఇఓ సాంబశివరావు చర్యలు తీసుకున్నారు. శ్రీవారి ఆలయం, ఇతర విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులు ఫోన్, ఈ-మెయిల్ ద్వారా సంప్రదించి తెలుసుకునే సౌకర్యాన్ని టిటిడి కల్పించింది. అదేవిధంగా టిటిడి అందిస్తున్న వసతులపై సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉన్న విషయం విదితమే. ఇలా వచ్చిన సలహాలు, సూచనలు, ఎదురవుతున్న సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు టిటిడి యాజమాన్యం ఈ వ్యవస్థను రూపొందించింది. భక్తులు ల్యాండ్ నెంబర్ 0877-2233333, 2277777, టోల్‌ఫ్రీ నెంబర్లు 18004254141, 1800425333333లలో సంప్రదించవచ్చు. అలాగే వాట్సాప్ 9399399399 నెంబరుకు భక్తులు తమ సమస్యలను తెలియజేయవచ్చు.

విజిలెన్స్ అదుపులో టిటిడి ఉద్యోగి

తిరుమల, జూలై 4: తిరుమల టిటిడి విజిలెన్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రఘుపతి అనే ఉద్యోగి 3 వేల రూపాయల విలువచేసే 6 విఐపి టిక్కెట్లను 33 వేల రూపాయలకు విక్రయించిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. భక్తుల ఫిర్యాదు మేరకు టిటిడి విజిలెన్స్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితిల్లోనూ విడిచిపెట్టవద్దని విజిలెన్స్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అయితే అప్పటికే మీడియాలో ఈ దళారి మోసం వెలుగు చూడటంతో ఆ ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రఘుపతి తన లెటర్‌పై ఆదివారం 6 విఐపి టిక్కెట్లకు అనుమతి పొందారు. ఒక్కో టిక్కెట్టు 500 రూపాయల చొప్పున 3 వేలు చెల్లించి టిక్కెట్లు తీసుకున్నారు. ఈ టిక్కెట్లను బెంగళూరుకు చెందిన శ్రీ్ధర్, విజయలక్ష్మి అనే భక్తులకు 5500 చొప్పున 6 టిక్కెట్లను 33 వేలకు విక్రయించారు. అయితే టిక్కెట్‌పై 500 రూపాయల ధర ఉండటాన్ని గమనించిన భక్తులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆ టిటిడి ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.