ఆంధ్రప్రదేశ్‌

భగ్గుమన్న జమ్మయ్యపేట నిర్వాసితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూలై 4: జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేను నిర్వాసిత గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. సోమవారం ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామం జమ్మయ్యపేటలో సర్వే నిర్వహించేందుకు భోగాపురం తహశీల్దార్ లక్ష్మారెడ్డి సిబ్బందితో వచ్చారు. అయితే ఇప్పటికే ఈ గ్రామానికి చెందిన రైతులు ఎయిర్‌పోర్టుకు భూములు ఇచ్చేది లేదంటూ కోర్టులో స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో రైతుల అంగీకారం లేకుండా అధికారులు ఏ విధంగా సర్వే నిర్వహిస్తారని గ్రామస్తులు అడ్డు తగిలారు. సర్వే సిబ్బంది గ్రామంలోకి ప్రవేశించారని తెలుసుకున్న గ్రామ పెద్ద దాట్ల శ్రీనివాసరావు గ్రామానికి వస్తుండగా పోలీసులు ఆయన్ని దారిలో అడ్డగించి నిర్భంధంలోకి తీసుకున్నారు.
దీంతో గ్రామస్తులు ఆందోళన చేయడంతో కొంతసేపు ఉద్రిక్తవాతావరణం నెలకొంది. గ్రామంలోకి వస్తున్న వ్యక్తిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారని గ్రామస్తుడు అప్పన్న పోలీసులను నిలదీసాడు. దీంతో సర్వే బృందం వేరే గ్రామానికి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బాలాత్రిపుర సుందరి తన వెంట సర్వే బృందాన్ని తీసుకుని గ్రామస్తులకు తెలియకుండా వేరే దారిలో గ్రామంలోకి చేరుకుని సర్వే నిర్వహించారు. విషయం తెలుసుకున్న మహిళలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బృందాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఇంతలో అక్కడికి చేరుకున్న భోగాపురం సిఐ వైకుంఠరావు, ఎస్సై దీనబంధు మహిళా కానిస్టేబుళ్ల సాయంతో మహిళలను అడ్డుకుని సర్వే కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.
జమ్మయ్యపేటలో పోలీసుల రక్షణలో రెవెన్యూ అధికారులు సర్వే కొనసాగిస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న పోరాట కమిటీ అఖిల పక్ష నాయకులు కాకర్లపూడి శ్రీనివాసరాజు, ఉప్పాడ సూర్యనారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్య నారాయణ అక్కడికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న గ్రామ సర్పంచ్ భర్త శ్రీనివాసరాజును విడిచిపెట్టాలని, సర్వే తక్షణం ఆపాలని డిమాండ్ చేసారు. సాయంత్రం సమయంలో సర్వేను నిలిపివేసి పోలీసులు అదుపులోకితీసుకున్న శ్రీనివాసరాజు వదిలిపెట్టారు. దీంతో అఖిల పక్ష నాయకులు ఆందోళన విరమించారు.