ఆంధ్రప్రదేశ్‌

త్వరలో 6వేల ఉద్యోగాల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూలై 4: పోలీస్ శాఖలో త్వరలో 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేస్తామని రాష్ట్ర డిజిపి జెవి రాముడు ప్రకటించారు. సోమవారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన ఆలయం వెలుపల విలేఖర్లతో మాట్లాడుతూ విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 2,800 మంది పోలీసులు రానున్నారన్నారు. ఈమేరకు అన్ని చర్యలూ పూర్తయ్యాయన్నారు. ఇక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవలే అనుమతించిందన్నారు. తిరుమల క్షేత్రంలో భద్రత కట్టుదిట్టంగా ఉందన్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆలయ భద్రతకు సంబంధించి మరింత ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఆలయం నాలుగు మాడ వీధుల్లో ఉన్న ఇన్నర్ కారిడార్ పనులు పూర్తయి పోలీసు పరిధిలోకి వచ్చాయన్నారు. ఔటర్ కారిడార్ నిర్మించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధమయ్యాయన్నారు. ఈ పనులు కూడా పూర్తయితే తిరుమలకు పూర్తిస్థాయిలో రక్షణ కవచం ఉంటుందన్నారు. టిటిడి సివిఎస్‌ఓ పోస్టు ఖాళీగా ఉందని విలేఖర్లు ఆయన దృష్టికి తీసుకెళ్లినపుడు త్వరలోనే ఆ పోస్టును భర్తీ చేస్తామన్నారు. ఇదిలా ఉండగా కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన డిజిపికి టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లుచేశారు.
కానిస్టేబుళ్ల ఎంపికలో మార్పులు:డిజిపి
నెల్లూరు: ఇకపై పోలీసు కానిస్టేబుళ్ల ఎంపికలో పలు మార్పులు చేపట్టనున్నట్లు డిజిపి రాముడు తెలిపారు. సోమవారం నెల్లూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కానిస్టేబుళ్ల భర్తీకి వయోపరిమితి సడలింపు యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొన్నారు. ఎస్సై, పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపికలో తొలుత రాత పరీక్ష నిర్వహించి, అనంతరం దేహ దారుఢ్య పరీక్షలు జరిపే ఆలోచనతో ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచినట్లు వెల్లడించారు. 5 కిలోమీటర్ల పరుగు పందెం కూడా తొలగించనున్నట్లు తెలిపారు.