ఆంధ్రప్రదేశ్‌

పొదుపే ఇంధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 4: ఇంధన పొదుపు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని బ్రిక్స్ దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. విశాఖ హోటల్ తాజ్ గేట్‌వేలో సోమవారం అంతర్జాతీయ ఇంధన సదస్సు ప్రారంభమైంది. సోమ, మంగళవారాల్లో జరిగే ఈ సదస్సుకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రధానంగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇంధన పొదుపు, సామర్థ్యం, వినియోగం తదితర కీలక అంశాలపై ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. బ్రిక్స్ దేశాల అదనపు కార్యదర్శి బిపి పాండే స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన ఈ సదస్సులో ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇంధన సామర్థ్యంతో నిర్వహించే ఎల్‌ఇడి విద్యుత్ దీపాల గురించి తెలుసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఒక్కటే విజయవంతంగా దీనిని నిర్వహించి ప్రథమ స్థానంలో నిలిచిందన్న విషయాన్ని తెలుసుకున్నారు. గ్రీన్ ఎనర్జీకి, ఇంధన పొదుపు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహానికి గుర్తింపుగా సదస్సు నిర్వహణ బాధ్యతను ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అప్పగించడంతో ఇంధన వినియోగంలో తాము సాధించిన విజయాలను సభ్య దేశాల ప్రతినిధుల ముందుంచింది. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం, విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ఇంధన సమర్ధత కలిగిన ఎల్‌ఇడి బల్బులు, ఐదు స్టార్‌రేటెడ్ ఫ్యాన్లు, రిప్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వ్యవసాయ మోటార్ల వాడకాన్ని పెంచుతున్న మరికొన్ని కీలక అంశాలు ఈ సదస్సులో చర్చకు వచ్చాయి. అలాగే విశాఖలో ఎల్‌ఇడి వీధి దీపాలను అమర్చిని పద్ధతిని, దాని ద్వారా సాధించిన 70 లక్షల యూనిట్ల విద్యుత్ పొదుపు, 420 లక్షల ఆదా చేసిన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలిసింది. సభ్య దేశాల ప్రతినిధుల సందేహాలను, ఆంధ్ర రాష్ట్రంలో సాధించిన విద్యుత్ పొదుపు విజయాల గురించి స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ చంద్రశేఖర్‌రెడ్డి నివృత్తి చేశారు. ప్రత్యేక ఇంధన పొదుపు, సమర్థత కలిగి ఉండే ప్రాజెక్టుల అమలు బ్రిక్స్ దేశాల ఆర్ధిక వ్యవస్థను మరింతగా బలపరుస్తాయని అభిప్రాయపడ్డారు.

చిత్రం... బ్రిక్స్ సదస్సులో మాట్లాడుతున్న
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ డైరెక్టర్ జనరల్ బిపి పాండే