ఆంధ్రప్రదేశ్‌

మోదీ, అమిత్‌షా ఉన్నంతవరకు ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 10: ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా అధికారంలో ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగే అవకాశం లేదని, అవసరమైతే మరోమారు అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు యోచిస్తామని టీడీపీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ వెల్లడించారు. గల్లా అరుణకుమారి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమితులైన నేపథ్యంలో అఖిల భారత కాపుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ టీడీపీ నాయకులు వూకా విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక చింతలచేను మార్గంలోని రామతులసీ కల్యాణ మండపంలో జరిగిన సన్మానసభకు ఆయన ప్రత్యేకంగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్ రైల్వేజోన్ ఏర్పాటుపై ఎందుకు ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయడం లేదని ప్రశ్నించారు. దేశమంతా ఒకే పర్యాయం ఎన్నికల నిర్వహణపై దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. ఈ ఏడాది ఎన్నికలు జరిగితే అక్కడ బీజేపీ ఓడిపోయే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని సర్వేలు చాటుతున్నాయన్నారు. ఈక్రమంలో అక్కడ బీజేపీ ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను అధిగమించేందుకు దేశమంతా ఏకకాలంలో ఎన్నికలు జరపాలనే అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్‌టీ నిర్ణయాలు దేశ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందన్నారు. దీంతో వ్యతిరేకత కూడా పెరిగిందన్నారు. ఇవి ప్రధాని తీసుకున్న అనాలోచిత నిర్ణయాలని అన్నారు.