ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధికి గిరిజనులే కొండంత బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ, జూలై 10: కొండకోనల్లో జీవించే గిరిజనులే సమాజాభివృద్ధికి కొండంత బలమని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజనులు, ఐటీడీఏ ఉద్యోగులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు. మైదాన ప్రాంతంతో పాటు ఏజెన్సీలో కూడా అనేకమైన సహజ వనరులున్నాయని వాటిని గిరిజనులకు ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిపై అందరి దృష్టి పడేటట్టు చూడాలన్నారు. అంతకుముందు పలువురు గిరిజన సంఘ నాయకులు ఏజెన్సీలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. 8 పంచాయతీల పరిధిలో 542 గ్రామాలు నాన్‌షెడ్యూల్ ఏరియాలో ఉన్నాయని, వాటిని షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని కోరారు. ఈ గ్రామాలు షెడ్యూల్ ఏరియాలో లేకపోవడంతో ఐటీడీఏ ద్వారా అందాల్సిన అనేక పథకాలు అందకుండా అన్యాయానికి గురవుతున్నామన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. గిరిజనులకు వృద్ధాప్య పింఛను 50 ఏళ్లకు పరిమితం చేయాలని, ఖాళీగా ఉన్న ఎస్టీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, గిరిజన విద్యార్థులు ఐఐటీ, మెడిసిన్ చదువుల్లో చేరేందుకు అదనపు సౌకర్యాలు కల్పించాలని కోరారు. గిరిజనులు ఉత్పత్తి చేస్తున్న పలు రకాల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. దీనిపై గవర్నర్ మాట్లాడుతూ ఈ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.