ఆంధ్రప్రదేశ్‌

డిసెంబర్‌లో కోటప్పకొండ హిల్ ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 10: కోటప్పకొండలో డిసెంబర్‌లో మూడు రోజుల పాటు హిల్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని అసెంబ్లీ ఆవరణలో ఆయన అటవీ, పర్యాటక, దేవదాయ శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంప్రదాయాలతో పాటు అడవుల పెంపకం వల్ల కలిగే లాభాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉత్సవంలో భాగంగా తోలుబొమ్మలాట, నాటకాలు, డప్పు కళాకారుల నృత్యాలు, కోలాటం ఉంటాయి.
పల్నాడు సంప్రదాయాలు, పుణ్యక్షేత్రాలు, కొండల గొప్పతనం వివరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోప్‌వే పనులను నవంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ కార్యదర్శి మీనా, తదితరులు పాల్గొన్నారు.