ఆంధ్రప్రదేశ్‌

రేషన్ డిపోల్లో కనిపించని కందిపప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 10: రేషన్ కార్డుపై రెండు కిలోల కందిపప్పు సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రచారానికే పరిమితం అవుతోంది. డబ్బు చెల్లించి, గోదాముల నుంచి కందిపప్పు తరలించేందుకు రేషన్ డీలర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో రేషన్ దుకాణాల్లో కందిపప్పు కనిపించని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్ నుంచి రేషన్ కార్డులపై కందిపప్పు పంపిణీ చేస్తున్నప్పటికీ, ఇండెంట్ శాతం సగటున 20కి మించకపోవడం గమనార్హం. రేషన్ కార్డుపై కందిపప్పు పంపిణీ చేసేందుకు నిర్ణయించిన ప్రభుత్వం ఏప్రిల్ నుంచి పంపిణీ ప్రారంభించింది. ప్రారంభంలో కిలో మాత్రమే సరఫరా చేసేందుకు నిర్ణయించినప్పటికీ, జూలై నుంచి రెండు కిలోలు పంపిణీని ప్రారంభించింది. కిలో 40 రూపాయలు చొప్పున పంపిణీ చేస్తారు. అయితే రాష్ట్రంలో చాలా చోట్ల డబ్బు చెల్లించి కందిపప్పు విడిపించేందుకు రేషన్ డీలర్లు ముందుకు రావడం లేదు. బియ్యం తీసుకుని వెళ్లేందుకు చూపిస్తున్న ఉత్సాహం కందిపప్పు విషయంలో లేకపోవడం గమనార్హం.
రాష్ట్రంలోని 1.44 కోట్ల కార్డులకు సంబంధించి కిలో చొప్పున ఏప్రిల్ నెలలో 14,046 టన్నుల కందిపప్పు పంపిణీ చేయాల్సి ఉండగా, కేవలం 35.12 శాతం మేరకే ఇండెంట్ పెట్టారు. కేవలం 4,924 టన్నులకు మాత్రమే డబ్బులు చెల్లించి, సరకును రేషన్ దుకాణాలకు తరలించారు. మే నెలలో కూడా కేవలం 28.73 శాతం మేరకే ఇండెంట్ పెట్టి కందిపప్పు పంపిణీ చేశారు. జూన్‌లో కూడా 28.02 శాతం మేరకే సరకు విడిపించారు. జూలైలో రెండు కిలోలు సరఫరా చేసేందుకు నిర్ణయించడంతో ఇండెంట్ గణనీయంగా పెరగాల్సి ఉంది. 28,641 టన్నుల కందిపప్పు పంపిణీ చేయాల్సి ఉండగా, కేవలం 17.83 శాతం (5106 టన్నులు) మేరకే విడిపించి, కార్డుదారులకు పంపిణీ చేశారు. దీంతో ఈ నెలల్లో ఇప్పటి వరకూ 21.9 శాతం మంది కార్డుదారులు కందిపప్పు తీసుకువెళ్లారు. రేషన్ దుకాణాలకు కేటాయించిన దానికి, డబ్బు చెల్లించి విడిపించి తీసుకువెళ్తున్న దానికి పొంతన ఉండటం లేదు. దీంతో ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రేషన్ దుకాణాల్లో కందిపప్పు అందుబాటులో ఉండటం లేదు. బహిరంగ మార్కెట్‌లో 70 రూపాయల వరకూ కిలో కందిపప్పు విక్రయిస్తుండగా, రేషన్ దుకాణాల్లో 40 రూపాయలకే ఇవ్వడం వల్ల డిమాండ్ ఉంటుంది. అయితే రేషన్ దుకాణాల్లో మాత్రం అందుబాటులో ఉండటం లేదు. కందిపప్పును దుకాణాలకు తరలించేందుకు భారీ మొత్తం చెల్లించి, సరకు విడిపించాల్సి ఉంటుంది. కందిపప్పును కార్దుదారులు కొనకపోతే, భారీ మొత్తంలో పెట్టుబడి వృథా అవుతుందని రేషన్ డీలర్లు భావిస్తున్నారు. దీంతో చాలా తక్కువ మొత్తానికే ఇండెంట్ పెట్టి స్టాక్‌ను తరలిస్తున్నారు. డీలర్లు ఎక్కువ మొత్తం చెల్లించి, స్టాక్ తరలిచేందుకు వెనుకాడుతున్నారని భావించిన ప్రభుత్వం ఒక నెల క్రెడిట్ ఇచ్చింది. సరకు అమ్మి, ఆ మొత్తం చెల్లించే వీలు కల్పించింది. అయినప్పటికీ, డీలర్లు ముందుకు రావడం లేదు. బియ్యాన్ని కిలో రూపాయికే సరఫరా చేస్తుండటం వల్ల స్టాక్‌ను పూర్తి స్థాయిలో తరలిస్తున్నారు. మిగిలిపోయినా, పెద్దగా నష్టపోయేది లేదని డీలర్లు భావిస్తున్నారు. దీంతో కందిపప్పు మండల స్థాయి గోదాముల్లో నిల్వ ఉన్నప్పటికీ, డీలర్ల వైఖరి కారణంగా కార్డుదారులకు కందిపప్పు అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నిల్వ ఉన్న కందిపప్పుకు తోడు అదనంగా మరో లక్ష క్వింటాళ్ల మేర కందిపప్పు నిల్వలు పౌరసరఫరా శాఖకు అందోళన కల్గిస్తున్నాయి. కందులను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి, వాటిని కందిపప్పుగా మార్చి రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న కందిపప్పు నిల్వలు తరగకపోవడంతో, మరో లక్ష క్వింటాళ్ల మేర ఉన్న కందిపప్పు ఎలా విక్రయించాలో అని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.