ఆంధ్రప్రదేశ్‌

నాటకాలు కట్టిపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 10: ప్రజాప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు నాటకాన్ని కట్టిపెట్టాలని గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు హెచ్చరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలో థర్డ్‌ఫ్రంట్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. సచివాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లపై మంత్రి నక్కా నిప్పులు చెరిగారు. జగన్ పాదయాత్రలో ముఖ్యమంత్రిపై అవాకులు చవాకులు పేలుతున్నారని, రాష్ట్భ్రావృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగులు, అధికారుల మనోస్థయిర్యాన్ని దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే అంతుచూస్తామని బెదిరించటం సమంజసం కాదన్నారు. పార్టీనేతలు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కాకాని గోవర్ధనరెడ్డి ఇదే తరహాలో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇకపై ఇలాంటి చర్యలను సహించేదిలేదని స్పష్టంచేశారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అవినీతి కారణంగా పలువురు అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుపాలయ్యారని గుర్తుచేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఓర్వలేక జగన్ ఇసుక, మట్టి దోపిడీ ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవాచేశారు. భూగర్భజలాల పెంపుదలలో భాగంగానే ప్రభుత్వం చెరువుల తవ్వకం పనులు చేపట్టిందన్నారు. మట్టిని రైతులు, ఇతర నిర్మాణాలకు వినియోగిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని నిందించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. జగన్‌కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీచేస్తామని ప్రకటించాలని సవాల్ విసిరారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందే తాము బీజేపీతో జతకట్టి కలసి పోటీచేసినట్లు గుర్తుచేశారు. సుప్రీం కోర్టు ఆదేశించినా కేంద్రంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే జగన్ కేసులు ముందుకు కదలటం లేదని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కాషాయ కండువా కప్పుకున్నారని మండిపడ్డారు. వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించి రాత్రికిరాత్రే ప్లేటు ఫిరాయించారని, కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి పదవినుంచి తొలగిస్తే తనకు అవకాశమివ్వాలని ఢిల్లీచుట్టూ కన్నా ప్రదక్షిణలు చేసిన సంగతి ప్రజలకు తెలుసన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పోటీకి ముఖం చాటేస్తే కన్నా ఒక్కరు మాత్రమే బరిలో దిగారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలని హితవు పలికారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి నక్కా ఆనందబాబు