ఆంధ్రప్రదేశ్‌

భారతీయ జగన్ పవన్ పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 10: భారతీయ జనతా పార్టీ నేడు అమిత్ షా, నరేంద్ర మోదీల కారణంగా భారతీయ జగన్ పవన్ పార్టీగా మారిందని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు చోట్ల ప్రజలనుద్ధేశించి మాట్లాడారు. రాష్ట్రానికి అన్నీ చేస్తామని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగేళ్లు తెలుగు ప్రజలను నమ్మించి మోసం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ తాము బీజేపీతో చెలిమిని తెంచుకున్నామన్నారు. దీంతో అప్పటి వరకు గోతి కాడ గుంటనక్క మాదిరి నక్కి కూర్చున్న వైకాపా బీజేపీ చంకనెక్కిందని అన్నారు. ఇక తానేమీ తక్కువ కాదని నాలుగేళ్ల తరువాత జనసేన నేత పవన్ కళ్యాణ్ సైతం మరో చంకనెక్కారని విమర్శించారు. వారిద్దరినీ అక్కున చేర్చుకున్న బీజేపీ చివరకు భారతీయ జగన్ పవన్ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. తనపై ఉన్న కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్ బీజేపీ నేతల కాళ్లు మొక్కుతూ వారి పంచన చేరారన్నారు. మరి పవన్ ఎందుకు భయపడి వారితో జత కట్టారని ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాలు రాష్ట్ర పాలన బాగుందని, అభివృద్ధి చంద్రబాబుతో సాధ్యమని చెప్పిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా మాట మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. నమ్మక ద్రోహానికి పాల్పడిన బీజేపీతో స్నేహం చేస్తున్న జగన్, పవన్ తమ సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారే తప్ప ప్రజాప్రయోజనాల కోసం కాదన్నది స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. విభజన సమస్యలన్నింటినీ గట్టెక్కి రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు తీయాలంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక శాసనసభా స్థానాలతో పాటు 25 లోక్‌సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరిగి తీరుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో వైకాపా, జనసేన, బీజేపీలను ఓడిస్తే ఇక వారు ఆ తరువాతి ఎన్నికల్లో కనిపించరని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తాను, టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న వారు ఒక్క ఆరోపణకు కూడా ఆధారాలు చూపలేక పారిపోతున్నారని అన్నారు. విభజన కష్టాలతో ఉన్న రాష్ట్రం అభివృద్ధి కోసం తాము కష్టపడుతుంటే అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి కష్టపడుతున్న తమపైనే రాళ్లు వేయడం వాళ్లకే చెల్లిందన్నారు. ప్రజలకు ద్రోహం చేసిన బీజేపీని ఒక్కమాట కూడా అనే ధైర్యం లేని జగన్, పవన్ ప్రజలకు ఏదో చేస్తారని ఆశలు పెట్టుకుంటే నట్టేట ముంచుతారని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట ఎంపి బుట్టా రేణుక పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

చిత్రం..ఎమ్మిగనూరులో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న మంత్రి నారా లోకేష్