ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో వౌలిక సదుపాయాలకు సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 10: నవ్యాంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేయటం.. ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించడం మాకు శ్రేయోదాయకమని సింగపూర్ ఆర్థికమంత్రి హుంగ్ స్వీ కేట్ అన్నారు. ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి ఆకర్షణీయమైన సహాయం అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఏపీలో అత్యుత్తమ వౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు అందించేందుకు తప్పక సహకరిస్తామన్నారు. మంగళవారం సింగపూర్‌లోని ట్రెజరీభవన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన అనంతరం ఆయన రాజధాని అమరావతికి.. రాష్ట్రంలో ఇతర అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు తమవంతు సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు. సింగపూర్ దార్శనికుడు లీకౌన్‌యూతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సారూప్యత ఉందని ప్రశంసించారు. ‘వీరిద్దరూ భారీ లక్ష్యాలను ఎంచుకున్నారు.. లక్ష్య సాధనకు శ్రమిస్తారు.. మొక్కవోని దీక్షాదక్షతలే ఉభయ ప్రాంతాలను పతనం అంచుకు చేరకుండా సురక్షితంగా నిలిపి ఉంచాయని’ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కష్టపడే స్వభావం ఉంది.. సమర్థవంతమైన నాయకత్వం ఉందన్నారు.. అమరావతిని హరిత, జీవన యోగ్యమైన నగరంగా తీర్చిదిద్దటం ఆర్థికాభివృద్ధికి దోహదపడే కీలక అంశమన్నారు. ఈ తరహా రాజధాని నిర్మాణానికి రూపక ల్పనచేసే ప్రక్రియలో సింగపూర్ భాగస్వామ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నామని స్పష్టంచేశారు. అభివృద్ధిలో గమ్యాలు చేరుకునేందుకు లక్ష్యాలు సాధించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఏకైక మార్గం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మాత్రమే అన్నారు. భారత్‌లో ప్రతిభాశీలురైన ప్రజానీకం ఉన్నారు.. వారికి మరింత నైపుణ్యం పెంపొందించటానికి చేస్తున్న కృషిలో భాగస్వాములుగా ఉన్నాం.. ఏపీతో కలసి పనిచేస్తుండటం..ప్రాజెక్టులకు ఫైనాన్స్ అందించడం శ్రేయోదాయకంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో వైమానిక అనుసంధానతను మరింత మెరుగుపరచి ఉభయ ప్రాంతాల మధ్య విమానాల రాకపోకలకు మరింత సానుకూల పరిస్థితులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.