ఆంధ్రప్రదేశ్‌

పవన్ కళ్యాణ్‌కు పాతిక ప్రశ్నలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 10: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన హోదాకు తగ్గట్టుగా మాట్లాడ్డం లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఎవరో చెప్పినవి, ఎక్కడో విన్న మాటలు తీసుకువచ్చి టీడీపీపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గంటా మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడపకు ఉక్కు, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కోసం మన ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడితే, దేశంలోని మిగిలిన ఎంపీల మద్దతు కూడగడతానని చెప్పిన పవన్ ఆ బాధ్యతను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. కేంద్రంపై టీడీపీ, వైసీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, పవన్ ఎందుకు మద్దతు తెలపలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి 70 వేల కోట్ల రూపాయలు రావాలని పవన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా తేల్చి, ఆ మొత్తాన్ని ఎందుకు రాబట్టలేకపోయారని ప్రశ్నించారు. రైల్వే జోన్ కోసం విశాఖలో టీడీపీ ఎంపీలు దీక్ష చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రంపై మాట్లాడే దమ్ము, ధైర్యం పవన్ కళ్యాణ్‌కు లేదని గంటా అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ లక్షల కోట్ల అవినీతికి పాల్పడి, అభియోగాలు ఎదుర్కొంటున్నా, ఆయన గురించి పవన్ పల్లెత్తు మాటైనా ఎందుకు అనలేదని ఆయన ప్రశ్నించారు. మోదీ, జగన్, పవన్ కలిసి ఆడుతున్న డ్రామాను జనం గమనిస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీని తానే గెలిపించానని పవన్ చెపుతున్నారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని మంత్రి గంటా అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకముందూ టీడీపీ గెలిచింది. ఆయన ప్రచారం చేసిన తరువాతా గెలిచింది. కాకినాడ, నంద్యాల ఉప ఎన్నికలే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసినా అక్కడ ఆ అభ్యర్థి ఓటమిపాలైన దాఖలాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ ఎన్ని అవాస్తవాలు మాట్లాడినా భరించాం. ఇక భరించే పరిస్థితుల్లో లేమని గంటా స్పష్టం చేశారు. రాష్ట్రం 17 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ, ఏ అభివృద్ధి కార్యక్రమానికీ ఇబ్బంది లేకుండా పాలన సాగిస్తున్న చంద్రబాబుపై మాట్లాడే అర్హత పవన్‌కు లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పలుకుబడిని ఉపయోగించి, కియా మోటార్స్ తెచ్చిన విషయాన్ని పవన్ తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. హుదూద్ తుపాను సమయంలో చంద్రబాబు విశాఖకు చేసిన సేవలు ఈ ప్రాంత ప్రజలు ఎన్నడూ మరిచిపోలేరని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆశించిన వారైతే పవన్ ఇప్పటికే మోదీపై ఒత్తిడి తెచ్చేవారని ఆయన అన్నారు.
సిట్ నివేదిక బహిర్గతం చేయాలి!
విశాఖ భూముల కుంభకోణంపై ఏర్పాటైన సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపింది. ఈ నివేదికను బయటపెట్టాలని మంత్రి గంటా డిమాండ్ చేశారు. ఈ నివేదిక బయటకు వస్తే, భూ కుంభకోణంలో ఎవరు దోషులో, ఎవరు నిర్దోషులో తేలిపోతుందని ఆయన అన్నారు. విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే వాసుపల్లి, సీనియర్ నాయకులు రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు