ఆంధ్రప్రదేశ్‌

పవన్, జగన్ ఏకం కావాలి: మోత్కుపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పవన్ కల్యాణ్, జగన్ ఒక్కటి కావాలని మాజీ మంత్రి, టీడీపీ తెలంగాణ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు కోరారు. గురువారం ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. తిరుమలేశుని దర్శించుకున్న తాను దివంగత ఎన్‌టిఆర్ కోరికను నెరవేర్చాలని స్వామిని ప్రార్థించానన్నారు. గాడ్సేను మించిన హంతకుడు బాబు అని తన చివరి క్షణంలో రామారావు ఆనాడే చెప్పారన్నారు. ఎన్‌టిఆర్‌కు అల్లుడై టీడీపీ జెండాను, పార్టీని బాబు దొంగిలించాడన్నారు. ఆయనకు దమ్ముంటే సొంతపార్టీ, జెండాతో ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. జగన్‌కు, పవన్‌కు సొంతపార్టీ, జెండాలున్నాయన్నారు. ఓటుకు నోటు విషయంలో రికార్డయిన వాయిస్ తనది కాదని బాబు చెప్పగలరా అని సవాల్ విసిరారు. బీజేపీతో నాలుగు సంవత్సరాలు కలిసి ఉండి ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయిన బాబు ఇప్పుడు జగన్, పవన్‌లు బీజేపీతో ఉన్నారనడం దారుణమన్నారు. 2019 ఎన్నికల్లో బాబును ఓడించాల్సిన అవసరం ఉందన్న ఆయన వామపక్షాలు, జనసేన, వైకాపా, దళితులు ఒక్కటై బాబును గద్దె దించాలని పిలుపునిచ్చారు.