ఆంధ్రప్రదేశ్‌

నేనేమైనా సంఘ విద్రోహినా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 12: ‘నేనేమైనా సంఘ విద్రోహినా? ధర్మం కోసం పోరాడుతున్న నన్ను హైదరాబాద్ నుండి ఆరు నెలల పాటు ఎలా బహిష్కరిస్తారు?’ అని కాకినాడ శ్రీ పీఠం వ్యవస్థాపకుడు స్వామీ పరిపూర్ణానంద ప్రశ్నించారు. హిందూ ధర్మం కోసం పోరాడుతున్న తనను సంఘ విద్రోహ శక్తిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. హైదరాబాద్ నగర బహిష్కరణను ఎదుర్కొంటున్న స్వామీజీ బుధవారం రాత్రి కాకినాడలోని శ్రీపీఠం చేరుకున్నారు. కాకినాడ శ్రీ పీఠంలో గురువారం తనను కలసిన విలేఖరులతో స్వామీజీ కొద్దిసేపు మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తనకు రెండు కళ్ళ వంటివన్నారు. అటువంటి తనను ఆరు నెలల పాటు హైదరాబాద్ నుండి ఏ విధంగా బహిష్కరిస్తారని ప్రశ్నించారు. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు నిరసనగా ధర్మాగ్రహ యాత్రకు తాను నడుం బిగించానన్నారు. ధర్మాగ్రహ యాత్రకు అనుమతి కోరిన తనను నిర్బంధించారని, అది చాలదన్నట్టు నగర బహిష్కరణ విధించారన్నారు. హైందవుల ఆరాధ్య దైవం శ్రీరాముడి ఔదార్యాన్ని, రామాయణ కావ్యం గొప్పతనాన్ని వివరించడానికి తాను చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. హైందవ ధర్మాన్ని, దేవతలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నది తమ డిమాండ్ అన్నారు. హిందూ దేవతలపట్ల అవమానకరంగా ప్రవర్తించే వారిని ఉపేక్షిస్తే సహించేది లేదన్నారు. హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతివొక్కరు కంకణబద్ధులు కావాలని స్వామీ పరిపూర్ణానంద పిలుపునిచ్చారు.
కాగా ఆరు నెలల పాటు హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన స్వామీజీని కాకినాడ శ్రీపీఠంలో పలువురు కలసి తమ సంఘీభావం ప్రకటించారు. స్వామీజీ హైదరాబాద్ నగర బహిష్కరణను తీవ్రంగా ఖండించారు. తనకు జరిగిన అన్యాయంపై స్వామీజీ కీలక నిర్ణయాలు తీసుకుంటారని, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని స్థానికులు ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ వ్యవహారంపై న్యాయ నిపుణులతోనూ, హైందవ ప్రముఖులతోనూ చర్చించిన పిమ్మట స్వామీజీ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని శ్రీ పీఠం ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రీయ హిందూ సేన, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు స్వామీజీపై బహిష్కరణ వేటును ఖండించారు. స్వామీజీ హైదరాబాద్ నగర బహిష్కరణను హిందూ ధర్మంపై దాడిగా భావిస్తున్నట్టు బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య అభివర్ణించారు. హైందవ ధర్మం కోసం పోరాడుతున్న స్వామీజీని అభినందించాల్సింది పోయి, అణచివేత చర్యలకు పాల్పడటం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని మాలకొండయ్య పేర్కొన్నారు.