ఆంధ్రప్రదేశ్‌

సమస్యలు కాదు.. పరిష్కారాలు చూపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 12: ఆక్వా రంగానికి భీమవరం రోల్ మోడల్ అని కేంద్ర పశుసంవర్థక, మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి ఇ రమేష్‌కుమార్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని అంశాలను ఇక్కడి ఆక్వా రైతులు అందిపుచ్చుకుని అగ్రస్థానంలో నిలుస్తున్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర మత్స్యశాఖ ఆక్వా రంగంలో నిషేధిత యాంటీ బయోటిక్స్ ఇతర రసాయన పదార్థాలపై అవగాహనా సదస్సును గురువారం నిర్వహించారు. ఎగుమతిదారులు, ఆక్వా రైతులు, హ్యాచరీల నిర్వాహకులు, ఫీడ్ తయారీదారులు, డ్రగ్స్ విక్రయదారులు తదితరులు హాజరయ్యారు. సదస్సులో పాల్గొన్న రమేష్‌కుమార్ మాట్లాడుతూ ఆక్వా రంగంలో ఉన్న సమస్యలు తనకు తెలుసునని, అయితే పరిష్కారాలు సూచించాలని ఈ రంగలో నిష్ణాతులైన వారిని కోరారు. ప్రస్తుతం చేపల పరిస్థితి బాగోలేదని, కొత్త రకాలు పెంచితే ఆదాయం, దిగుబడి బాగుంటుందన్నారు. ఇప్పటికే అసోం, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆంధ్రా చేపలపై నిషేధం విధించారని చేపల రైతుల సంఘం అధ్యక్షుడు ఉద్దరాజు పద్మనాభరాజు సదస్సు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ ఈ అంశంపై అధ్యయనానికి ఒక కమిటీని అక్కడికి పంపిస్తామని పేర్కొన్నారు.
రొయ్యల ఎగుమతుల విషయంలో ఏం జరుగుతుందో తనకు తెలుసునని జాయింట్ సెక్రటరీ రమేష్ కుమార్ వెల్లడించారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ తమకు చెబుతుంటారన్నారు. వ్యవసాయంతో రైతుకు ఆదాయం పెరగదని, కోళ్ల పెంపకం, డైరీ ఫాం తదితరాల ద్వారా రెండింతల ఆదాయాన్ని పెంచుకోవచ్చునన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తిచేయాలని ఆక్వా రైతులకు పిలుపునిచ్చారు.అంతకుముందు జాయింట్ సెక్రటరీ రమేష్‌కుమార్ భీమవరం సమీపంలోని ఆనంద గ్రూప్ ఆక్వా ల్యాబ్‌ను పరిశీలించారు. అక్కడ రొయ్యలకు పరీక్షలు నిర్వహించే పరికరాలను పరిశీలించారు. రైతువారీగా ఏ విధంగా పరీక్షలు చేస్తున్నారో ఆనంద గ్రూప్ ఛైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజును అడిగి తెలుసుకున్నారు. చెరువులో రొయ్యల సీడ్ వేసిన నాటి నుంచి పట్టుబడులు పట్టేవరకు వనామి రొయ్యలకు ఎన్నిరకాల పరీక్షలు నిర్వహిస్తారో విశ్వనాథరాజు ఆయనకు వివరించారు. ఆనంద హ్యాచరీలో పెంచుతున్న వివిధ రకాల చేపలు, రొయ్యల సీడును పరీశీలించారు.