ఆంధ్రప్రదేశ్‌

దేవుని దయతో ఏడాది ముందే విడిపోయాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 12: ‘్భగవంతుడి దయ మా మీద ఉండబట్టి, ఎన్నికలకు సంవత్సరానికి ముందే చంద్రబాబు మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. 2014 ఎన్నికల తంతు పూర్తయినప్పటి నుంచి ఆయన బీజేపీని భ్రష్టుపట్టించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఏపీకి అన్యాయం చేసిందంటూ కేంద్రాన్ని దోషిగా ప్రజల ముందు నిలబెట్టడంలో చంద్రబాబు విజయం సాదించారు. ఇంకా అతనితో కలిసి ఉంటే, బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరి ద్వారా లబ్దిపొందారో, వారికే వెన్నుపోటు పొడవడం చంద్రబాబు సహజ గుణమని, బీజేపీ ద్వారా లబ్ధిపొంది, ఆ పార్టీ చేతులు నరకడాన్ని బట్టి ఆయన నైజం మరోసారి బయటపడిందని అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణలో అనేక అవకతవకలు జరిగాయి. పేదోళ్ల భూములను ఎకరా నాలుగు, ఐదు లక్షలకు కొనుగోలు చేసి, వాళ్ల పార్టీకి చెందిన వారి భూములను 45 నుంచి 50 లక్షలకు కొనుగోలు చేస్తున్నది నిజామా? కాదా? అని కన్నా ప్రశ్నించారు. పోలవరం భూసేకరణ విషయంలో అక్కడి గిరిజనుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని కాంట్రాక్టర్ల లారీల్లోనే ఇతర ప్రాంతాలకు తరలించడం నిజంకాదా? అని ప్రశ్నించారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్. దీన్ని కేంద్రమే నిర్మిస్తామని చెపితే, కాదని చంద్రబాబు తీసుకున్నది కమీషన్ల కోసం కాదా? అని కన్నా ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా కేంద్రమే ఇస్తుంటే, అక్కడ మోదీ ఫొటో లేకుండా, చంద్రబాబు ఫొటోలు పెట్టుకుని ఊరేగడం సమంజసమా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా హంద్రీనీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర ప్రాజెక్ట్‌లు ఏమాత్రం ముందుకు వెళ్లడం లేదు. కనీసం ఆ ప్రాజెక్ట్‌లకు వేసిన శంకుస్థాపన రాళ్లనైనా చంద్రబాబు చూశారా? అక్కడ ఆయన ఫొటోలు ఎందుకు పెట్టకోలేదని కన్న ప్రశ్నించారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని అనడంలో వాస్తవం లేదని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. దేశంలోని కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలన్నింటికన్నా రెండు రెట్ల ఎక్కువగా ఇళ్లను ఏపీకి మంజూరు చేశామని అన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ఎస్‌ఎఫ్‌టీకి 800 రూపాయలు ఖర్చు చేస్తూ, పేదోళ్ల నుంచి 2,400 రూపాయలు వసూలు చేస్తున్నారని కన్నా అన్నారు. పేదోళ్ల ఇళ్లతో కూడా చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజుపట్నం పోర్టు రావడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆయన అన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ గత నెల 20న దీక్ష మొదలుపెడితే, ఆ ఫ్యాక్టరీ నిర్మాణానికి మెకాన్ కంపెనీకి కావల్సిన వివరాలను 22న చంద్రబాబు అందించిన విషయం జనానికి తెలియకుండా దాచిపెట్టారని అన్నారు. అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన భూమిపై స్పష్టత లేదు. ఉక్కు తయారీకి కావల్సిన ఐరన్‌ఓర్‌పై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదని కన్నా అన్నారు. దుగ్గరాజుపట్నం పోర్టుకు ప్రస్తుతం చూపించిన ప్రాంతం సరైనది కాదని నివేదిక ఇచ్చిన తరువాతైనా, చంద్రబాబు దానికి ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ఎందుకు చూపించలేదని కన్నా ప్రశ్నించారు. రెవెన్యూ లోటు విషయంలో చంద్రబాబు చెపుతున్నవన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. 2014-15 సంవత్సరంలోని రెవెన్యూలోటుకు సంబంధించిన నిధులను కేంద్రం ఇచ్చిందని, అదనంగా మరో 1500 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసిందని అన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడం చేతకాక, రాజకీయంగా బీజేపీపై బురద జల్లుతున్నారని ఆయన అన్నారు.
2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజల ముందుకు వెళ్లి చెప్పుకోడానికి ఏమీ లేక బీజేపీని దోషిగా ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని కన్నా ఆరోపించారు.
విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని, రైల్వే జోన్ కూడా ఇచ్చితీరుతామని కన్నా స్పష్టం చేశారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ