ఆంధ్రప్రదేశ్‌

ప్రజలకు మెరుగైన ‘పోలీసు’ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 12: ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లను డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి ముఖ్యమంత్రి అభీష్టం మేరకు మరణాల సంఖ్య తగ్గించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని పోలీసు జిల్లాల ఎస్పీలు, విశాఖ, విజయవాడ పోలీసు కమిషనర్లతో డీజీపీ గురువారం పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి తొలి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా రోడ్డు భద్రత, శాంతి భద్రతలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. దీనిలో భాగంగా వాహన చోదకులకు రోడ్డు భద్రతపై అవగాహన కలిగించేందుకు ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఇక నుంచి ద్విచక్ర వాహనాలు నడిపేవారితోపాటు వెనుక కూర్చుండేవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కారు, ట్రక్కు డ్రైవర్లు, ద్విచక్ర వాహనాదారులకు ట్రాఫిక్ నిబంధనలు తెలియచేసేందుకు తప్పనిసరిగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టి ఫలితాలు సాధించిన సిబ్బంది, అధికారులకు ఏబిసిడి, ఐపిఎస్ అవార్డుల మాదిరిగా తగిన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కలిగించే కార్యక్రమాల్లో భాగంగా రవాణా శాఖ నిర్వహిస్తున్న లైసెన్స్ మేళా వంటి కార్యక్రమాల్లో పోలీసులు భాగస్వామ్యం కావాలని సూచించారు. మరణాల సంఖ్య తగ్గించేందుకు, రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు పదిరోజుల్లోగా జిల్లా రోడ్డు భద్రతా కమిటీలు చర్యలకు ఉపక్రమించాలన్నారు. రహదారి ఇంజనీరింగ్ లోపాలను గుర్తించి వాటి మరమ్మతుల నిమిత్తం వెంటనే ఆర్ అండ్ బి అధికారులకు తెలియచేయాలన్నారు. అతివేగం, రోడ్డు నిర్మాణ లోపాలు, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్‌లు వినియోగించకపోవడంతో పాటు, రోడ్డు ప్రమాద మరణాలకు ప్రధాన కారణాలను అనే్వషించాలని, అదేవిధంగా జాతీయ రహదారులపై పెట్రోలింగ్ పెంచి, నేషనల్ హైవే పెట్రోలు సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.రౌడీలు, అసాంఘిక శక్తులను అణిచివేయాలన్నారు. మహిళలు, విద్యార్థినులు, యువతుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారి రక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా పోలీసు సిబ్బంది విధిగా స్విమ్మింగ్ నేర్చుకోవాలని, వారి ఆరోగ్య పరిరక్షణ, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ హెల్త్‌క్యాంపులు, యోగా వంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీలను ఆదేశించారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ ఠాకూర్