ఆంధ్రప్రదేశ్‌

రెండున్నర కిలోమీటర్లతో ముగిసిన యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిక్కవోలు, జూలై 12: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో గురువారం రెండున్నర కిలోమీటర్ల మేర మాత్రమే కొనసాగింది. బిక్కవోలు మండలం ఊలపల్లి పాకల నుంచి గురువారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర సుమారు రెండున్నర కిలోమీటర్ల అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ముగించారు. నియోజకవర్గ వైసీపీ కో-ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పార్టీశ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఉదయం 9గంటలకు ఊలపల్లి వంతెన వద్దకు చేరుకున్న భారీ జనసందోహంతో వెలంపేట మీదుగా సాగిన పాదయాత్ర మధ్యాహ్నానికి గ్రామ శివార్లకు చేరింది. జగన్‌మోహనరెడ్డిని చూడడానికి, సెల్పీలు తీసుకోవడానికి యువత, మహిళలు ఎగబడ్డారు. వర్షం కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు భారీగా తరలివచ్చారు. పలువురు పింఛన్లు, గృహనిర్మాణ రుణాలు, తదితర సంక్షేమ పథకాలు అందడం లేదని జగన్ వద్ద వాపోయారు. మధ్యాహ్నానికి గ్రామ శివార్లలో ఏర్పాటుచేసిన శిబిరం వద్దకు చేరిన పాదయాత్రను ముగించారు. అక్కడి నుండి జగన్ హైదరాబాదుకు పయనమయ్యారు. శుక్రవారం పాదయాత్రకు విరామం. తిరిగి శనివారం ఉదయం 9గంటలకు ఊలపల్లి గ్రామంలోని శిబిరం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, మానుకొండ సాగర్‌రెడ్డి, వంగా రామగోపాలరెడ్డి, యమసాని రవి, మైనార్టీ సెల్ నాయకులు షేక్ కాలేషా, బిక్కవోలు మసీద్ అధ్యక్షులు షేక్ మహబూబ్ జానీ తదితర నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..పాదయాత్ర కొనసాగిస్తున్న జగన్