ఆంధ్రప్రదేశ్‌

స్వల్పంగా పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 12: గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ నుండి వస్తున్న వరద నీటితో ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. గురువారం బ్యారేజీ వద్ద 8.70 అడుగుల నీటిమట్టం నమోదైంది. 13.32 మీటర్ల ప్రవాహ మట్టంలో వరద జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. బ్యారేజీకి ఉన్న నాలుగు ఆర్మ్‌లలో 175 గేట్లను 0.70 మీటర్ల మేరకు ఎత్తివేసి, 3లక్షల 6వేల 840 క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడుదలచేస్తున్నారు. తూర్పు డెల్టాకు నీటి విడుదలను రద్దుచేశారు. మధ్య డెల్టాకు వెయ్యి క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 2వేల క్యూసెక్కులు వెరసి 3వేల క్యూసెక్కుల జలాలను డెల్టా కాలువలకు విడిచి పెట్టారు.బ్యారేజీ నుండి దిగువకు భారీగా వరద జలాలను విడిచిపెడుతుండటంతో ఆ ప్రభావం దిగువనున్న కోనసీమపై పడుతోంది. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పి గన్నవరం మండలంలో నాలుగు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకల నిమిత్తం రెవెన్యూ అధికారులు నాలుగు ఇంజను పడవలను ఏర్పాటుచేశారు. అయినవిల్లి మండలంలో ముక్తేశ్వరం-కోటిపల్లి రేవు ప్రయాణికులు దాటడానికి వేసిన గట్టు నీటి ప్రవాహ ఉద్ధృతికి తెగిపోయింది. దీంతో ముక్తేశ్వరం నుండి కోటిపల్లి మీదుగా కాకినాడ వెళ్ళే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చిత్రం..ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుండి సముద్రంలోకి విడిచిపెడుతున్న వరద జలాలు