ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీఐ కమిషనర్ల నియామక ప్రక్రియ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 12: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్‌ల నియామక ప్రక్రియను పూర్తి చేసింది. నాలుగేళ్ల తరువాత తిరిగి ఈ నియామకాలు జరగబోతున్నాయి. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటే ప్రభుత్వం ఆలస్యంగానైనా ఈ విషయంలో కసరత్తు చేపట్టింది. ముందుగా దరఖాస్తులు స్వీకరించి వాటిని సెలక్షన్ కమిటీకి పంపగా ఆ కమిటీ గురువారం ముగ్గురి అభ్యర్థిత్వాలను ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. వీరిలో ఇటీవల విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో అడిషినల్ డీజీగా పదవీ విరమణ చేసిన బీఎల్ రమణకుమార్ (కృష్ణా), రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి రవికుమార్ (రాజమండ్రి), టీడీపీ లీగల్ సెల్ సభ్యుడు జనార్ధనరావు (కడప) ఎంపికయ్యారు. ఈ నియామకాలకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఇక చీఫ్ కమిషనర్‌ను ఎంపిక చేయాల్సి ఉంది.