ఆంధ్రప్రదేశ్‌

మైనారిటీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 5: మైనారిటీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో తూర్పు నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఏర్పాటయిన ఇఫ్తార్ విందుకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, ఎంపీలు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు జివి ఆంజనేయులు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, నక్కా ఆనందబాబు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు, మద్దాళి గిరిధర్ ఇతర పార్టీ ప్రముఖులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణతో పాటు రికవరీ చేసుకున్న వాటిపై వచ్చే ఆదాయాన్ని వారి సంక్షేమానికే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ముస్లిం మైనారిటీ వర్గాల్లో నిరుపేదలను అదుకునేందుకు తమ పార్టీ ముందుంటుందని తెలిపారు.

చిత్రం..పార్టీ నాయకుల నుంచి ఇఫ్తార్‌విందు స్వీకరిస్తున్న నారా లోకేష్