ఆంధ్రప్రదేశ్‌

పారదర్శకత, నిబద్ధతతో గృహ లబ్ధిదారుల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 12: భవిష్యత్తులో చేపట్టబోయే గృహ నిర్మాణాల్లో అధికారులు మరింత నిబద్ధతతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ నెల 5న అద్భుతమైన రీతిలో నిర్వహించిన గృహ ప్రవేశాల వేడుకల్లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. తాడేపల్లిలోని రాష్ట్ర హౌసింగ్ బోర్డు కార్యాలయంలో గురువారం రాష్ట్ర స్థాయి ప్రాజెక్ట్ డైరెక్టర్‌ల సమావేశంలో మంత్రి కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ సాధ్యంకాని విధానంలో రెండవ విడత గృహ ప్రవేశాల సందర్భంగా ఒకే దఫా మూడు లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు అత్యంత ఘనంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానన్నారు. ఇళ్ల నిర్మాణాలను అప్‌లోడ్ చేయడంలో ఇప్పటికి 1.75 లక్షలు పూర్తి చేశామన్నారు. ఇళ్ల నిర్మాణాల వివరాలు అప్‌లోడ్ చేయడంలో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన 4 లక్షల గృహాల గృహ ప్రవేశాల కార్యక్రమం పూర్తి చేసుకున్న సందర్భంగా స్ఫూర్తి పొందామన్నారు. అక్టోబర్, జనవరి నెలల్లో చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వామ్యమై వాటిని పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమీక్షలో 13 జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన సూచనలను, వారి అభిప్రాయాలను తెలుసుకున్నామన్నారు.