ఆంధ్రప్రదేశ్‌

రామానుజాచార్యులు అందరికీ ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, జూలై 5: దేశ చరిత్ర పుటలలో హిందూ ధర్మంలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నవారు శ్రీరామానుజాచార్యులు అని, ఆయనను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్‌స్వామి హితబోధ చేశారు. నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడు సమీపాన ఉన్న విపిఆర్ కనె్వర్షన్ సెంటర్‌లో మంగళవారం రామానుజాచార్యుల సాహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా చిన్నజీయర్‌స్వామి ఆ ప్రాంతంలో నిర్వహించారు. మొదట జ్యోతి ప్రజ్వలనతో స్వామి వారు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి వారు భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. దేవాలయాలలో ప్రవేశానికి అందరూ సమానులేనని వెయ్యి ఏళ్ల క్రితమే రామానుజాచార్యులు ఆచరించి చూపించారన్నారు. హిందువు తమ సంస్కృతిని కాపాడుకోవాలని, మతం, కులం పేర్లు చెప్పి రాగద్వేషాలను విడనాడాలని ఆయన హితవుపలికారు. హైదరాబాద్ శివారు శంషాబాద్ వద్ద 216 అడుగుల ఎతె్తైన రామానుజాచార్యుల స్వామి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి 2014లో సంకల్పించామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఈకార్యక్రమాన్ని మొదలుపెట్టామని, ప్రస్తుతం రాష్ట్రం విడిపోవడంతో అమరావతి పరిసరాల ప్రాంతంలో కూడా స్వామి వారి విగ్రహ ఏర్పాట్లకు ప్రయత్నాలు చేస్తున్నామని రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి సుమారు వెయ్యి కోట్లు నిధులు కావల్సి ఉంటుందని ఆయన చెప్పారు. గజల్ శ్రీనివాస్ చేసిన పాఠకచేరి భక్తులను ఆహ్లాదపరిచింది.

చిత్రం.. నెల్లూరులో ప్రజలకు అనుగ్రహభాషణం చేస్తున్న చిన్న జీయర్