ఆంధ్రప్రదేశ్‌

పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 13: ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అధికారికంగా శ్రీకాకుళంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దినేష్‌కుమార్ అధ్యక్షతన వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. స్వాతంత్య్ర వేడుకలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సీఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రభుత్వశాఖల శకటాలు (టాబ్లూస్)ను అలంకరించాలని సూచించారు. కార్యక్రమాలకు హాజరయ్యే ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులు, ఇతర వీవీఐపీలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలన్నారు. వేడుకలను విజయవంతం చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. వేడుకలలో 12 ప్రభుత్వశాఖలకు సంబంధించి రాష్టస్థ్రాయిలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రధాన శకటాలు ముందుండాలని సూచించారు. సమావేశంలో రోడ్లు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, అడిషనల్ డీజీ హరిగుప్తా, జీఎడీ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, ఎపీఎస్పీ బెటాలియన్ ఐజీ ఆర్‌కె మీనా, సమాచార, పౌరసంబంధాల అధికారి పాలడుగు వెంకటేశ్వర్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి, ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ, శ్రీకాకుళం మునిసిపల్ కమిషనర్ ఆర్ శ్రీరాములు పాల్గొన్నారు.