ఆంధ్రప్రదేశ్‌

విజయవాడలో ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ కేంద్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 13: విదేశాలకు పార్శిళ్లు పంపించే వినియోగదారుల సౌకర్యార్థం భారత తపాలశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని విజయవాడ నగరంలో ప్రత్యేకమైన ప్యాకింగ్ సదుపాయంతో కూడుకున్న ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ కౌంటర్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె.బాలసుబ్రమణియన్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్‌లో గత సంవత్సరం విదేశాలకు పార్శిళ్లు పంపడం ద్వారా సుమారు రూ.55 లక్షలు ఆదాయం పొందామన్నారు. ప్రస్తుతం విజయవాడలో ప్రారంభిస్తున్న స్పీడ్‌పోస్టు కౌంటర్ తరహా సేవలు రాష్ట్రంలోని ఇతర ముఖ్య నగరాలైన విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అనంతపురం నగరాల్లో త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.