ఆంధ్రప్రదేశ్‌

ఉద్యమంలా వనం - మనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: రాష్ట్రంలో వనం -మనం కార్యక్రమంలో ఉద్యమస్ఫూర్తితో మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ శాఖమంత్రి శిద్దా రాఘవరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఒంగోలులోని కలెక్టరేట్‌నుండి రాష్ట్ర అటవీశాఖమంత్రి మంత్రి శిద్దా రాఘవరావువనం -మనం కార్యక్రమంపై రాష్ట్ర అటవీశాఖ, అనుబంధ శాఖల అధికారులతో వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ రాష్ట్రంలో ఈనెల 14వతేదీన వనం -మనం కార్యక్రమాన్ని కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటి యూనివర్శిటిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఈనెల 14నుంచి కార్తీక పౌర్ణమి రోజు వరకు అంటే 123రోజులపాటు ఈ పథకం కింద మొక్కలు నాటాలన్నారు. రాష్ట్రంలో ఈ పథకం కింద 26కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. మొక్కల పెంపకంపై విద్యాలయాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.
నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు జియో టాగ్ చేయాలన్నారు.