ఆంధ్రప్రదేశ్‌

వేగంగా అమరావతి నిర్మాణ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 13: ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనంత వేగంతో అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక మంత్రి పి.నారాయణ అన్నారు. స్థానిక ఏపీసీఆర్‌డీఏ కార్యాలయంలో శుక్రవారం విలేఖరులతో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ప్రారంభమైన ప్రభుత్వ అధికార్ల, ఉద్యోగులకు చెందిన 3,840 నివాస ఫ్లాట్లు డిసెంబర్ 31నాటికి పూర్తవుతాయన్నారు. ఈ ఫ్లాట్ల నిర్మాణంలో అధునాతనమైన ‘షేర్వాల్ టెక్నాలజి’ వినియోగిస్తున్నామని, వారానికి ఒక అంతస్తు పూర్తవుతోందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించే సిటీ సివిల్ కోర్టు పనులు సెప్టెంబర్ 31నాటికి పూర్తవుతాయన్నారు. రాష్ట్ర సచివాలయం, ప్రభుత్వశాఖల అధిపతుల కార్యాలయాలకు చెందిన 5 టవర్ల పనులు మొదలయ్యాయన్నారు. వీటిలో 50 అంతస్తుల భవనం, 45 అంతస్తుల భవనాలు నిర్మించాల్సి ఉన్నందున 24 నెలల సమయం పడుతుందన్నారు. హైకోర్టు నిర్మాణానికి టెండర్లు పిలిచామని, వీటిని ఈ నెల 25న తెరుస్తామని ఆయన వివరించారు. అసెంబ్లీకు సంబంధించి డిజైన్స్ పరిశీలనలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ పనులన్నీ 11వేల కోట్లతో చేపడుతున్నామన్నారు. కేవలం పునాది వేసేందుకు 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని, పనులన్నీ వేగంగా జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. 16 వందల కిలోమీటర్ల రోడ్డు పనులు చేపట్టాల్సి ఉండగా 320 కిలో మీటర్ల ట్రంక్ రోడ్లు పనుల్లో 280 కిలోమీటర్ల రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఇవి పూర్తవుతాయన్నారు. వర్షాకాలం తర్వాత పనుల వేగం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. అమరావతి పనుల గురించి మాట్లాడే ముందు ఇక్కడి పనుల్ని స్వయంగా చూసి తెలుసుకోవాలని సూచించారు. అన్ని గ్రామాలు, మండలాల నుంచి ప్రజల్ని రప్పించి అమరావతి పనులు చూపించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. విలేఖర్లు సమావేశంలో సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, అధికారులు పాల్గొన్నారు.