ఆంధ్రప్రదేశ్‌

ఏడు ఖండాల్లో ఎతె్తైన పర్వతాల అధిరోహణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, జూలై 13: ఏడు ఖండాల్లోని ఎతె్తైన పర్వతాలను అధిరోహించాలన్నదే తన ధ్యేయమని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఆంధ్రప్రదేశ్ తొలిమహిళ ఆశాకిరణ్ రాణి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం విశాఖ జిల్లా చోడవరంలో విలేఖరులతో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించానని, ఆ స్ఫూర్తితోనే ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతంతోపాటు ఏడు ఖండాల్లో ఉన్న ఎతె్తైన పర్వతాలను అధిరోహించాలన్నది తన లక్ష్యమన్నారు. ఇందుకు ప్రజలు, ప్రభుత్వం సహకారం అందించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఐపీఎస్ కావాలన్నది తన కోరికగా ఆమె వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం వియ్యాలపేట కుగ్రామంలో తన ప్రాథమిక చదువు జరిగిందని, నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను ఎతె్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మిషన్ ఎవరెస్టు కార్యక్రమం ద్వారా 160 మంది వరకు ఎంపిక కాగా డార్జిలింగ్ శిక్షణా కార్యక్రమానికి వచ్చేసరికి 40 మంది ఎంపికయ్యారని, అక్కడి నుంచి లడక్ శిక్షణకు చేరుకునే సరికి పదిమంది మాత్రమే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు ఎంపికయ్యారని అందులో తాను మాత్రమే బాలికనని అన్నారు.