ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రా చేపలు నాణ్యమైనవే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 13: ఆక్వా రాజధానిగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి ఎగుమతి చేస్తున్న చేపల్లో ఫార్మాలిన్ అవశేషాల్లేవని టాస్క్ఫోర్స్ అధికారులు నిర్ధారించారు. రాష్ట్రం నుండి ఎగుమతిచేస్తున్న చేపల్లో ఫార్మాలిన్ అవశేషాలుంటున్నాయంటూ నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, పశ్చిమ బంగ వంటి రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. దీనితో చేపల ఎగుమతిదారులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ అడిషనల్ డైరక్టర్, పశుసంవర్ధకశాఖ అడిషనల్ డైరక్టర్, ఫుడ్ సేఫ్టీ తదితర అధికారుల బృందాన్ని ఆయా రాష్ట్రాలకు పంపించింది.
కాగా రాష్ట్రం నుండి ఎగుమతి అయ్యే చేపల్లో అత్యధిక శాతం పశ్చిమ గోదావరి జిల్లా నుండే కావడంతో శుక్రవారం భీమవరంలో వివిధ శాఖల అధికార్లతో కూడిన టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు జరిపింది. ముందుగా చేపలు పట్టుబడి చేసిన చెరువు నుంచి తీసుకువచ్చారు. వాటిని స్థానికంగా ఒక ఆక్వా ఎక్స్‌పోర్టు సంస్థ ఐస్ బాక్సుల్లో వేయడానికి సిద్ధం చేస్తున్న సమయంలో టాస్క్ ఫోర్స్ బృందంలోని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఫణి ప్రకాష్ సిఫీ పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా చేపల్లో ఎటువంటి ఎటువంటి ఫార్మాలిన్ అవశేషాలు లేవని తేలింది. ఫార్మాలిన్ వినియోగిస్తే చేప నలుపురంగులోకి వస్తుందని, అది వినియోగించకపోతే చేప ఎరుపు రంగులో ఉంటుందని ఫణిప్రకాష్ తెలిపారు. పరీక్షల అనంతరం చేపలను బాక్సులో ఐస్‌తో అధికారుల ముందు లోడ్ చేశారు. ఆ బాక్సుకు టాస్క్ఫోర్స్ తనిఖీ చేసి ఎటువంటి ఫార్మాలిన్ లేనట్లు నిర్ధారించిన సర్ట్ఫికెట్‌ను అతికించారు. ఇలా ఎగుమతిచేసే ప్రతి బాక్సుకు సర్ట్ఫికెట్‌ను అతికిస్తున్నారు.ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఫణి ప్రకాష్ మాట్లాడుతూ చేపల ఎగుమతిదారులు ఏ చెరువు నుంచి చేపలు కొనుగోలు చేశారో రికార్డు చేస్తామని, ఆ తర్వాత చేపలకు పరీక్షలు జరుపుతామని, ఫార్మాలిన్ అవశేషాలు లేవని నిర్ధారించుకున్నాక అనుమతులు జారీచేస్తామన్నారు. సైజు ఆధారంగా ప్రతీ బాక్సుకు 20 నుంచి 25 చేపలు పడతాయన్నారు. ఏడాది క్రితం ఆంధ్రా చేపలపై పక్క రాష్ట్రాలు ఫిర్యాదులు చేశాయని, అప్పుడు స్వయంగా తాము అక్కడకు వెళ్ళి పరీక్షలు జరిపి వారికి నమ్మకాన్ని కల్పించామన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఫిర్యాదులు చేస్తున్నారని తప్పుడు సమాచారాన్ని అందించి భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ప్రతీ ఒక్కరూ నాణ్యమైన చేపలు తిని ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

చిత్రం..చేపలను పరిశీలిస్తున్న టాస్క్ఫోర్స్ అధికారి ఫణిప్రకాష్