ఆంధ్రప్రదేశ్‌

జగన్‌ది మార్నింగ్, ఈవినింగ్ వాక్ మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 14: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేపట్టింది పాదయాత్ర కాదని, మార్నింగ్, ఈవినింగ్ వాక్ మాత్రమేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. శనివారం గుంటూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న అనంతరం జరిగిన విలేఖర్ల సమావేశంలో మంత్రి పుల్లారావు మాట్లాడారు. వైసీపీ ఎంపీలు తమ స్వప్రయోజనాల కోసమే రాజీనామాలు చేశారు తప్ప, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం కాదన్నారు. జగన్మోహనరెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రాన్ని, ప్రధాని మోదీని విమర్శించకుండా ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం వైకాపా, బీజేపీ మధ్య అనుబంధాన్ని బహిర్గతం చేస్తోందన్నారు. ప్రజా సమస్యలను చర్చించే వేదికైన అసెంబ్లీని బహిష్కరించాలని జగన్ పిలుపునివ్వడం ఆయన పైశాచికత్వానికి నిదర్శనమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు ఇవ్వనందుకే చంద్రబాబు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారన్నారు. మోదీ చేసిన మోసానికి చంద్రబాబు తిరుగుబావుటా ఎగురవేశారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారన్నారు. జగన్ మాత్రం పదవి కోసం, స్వప్రయోజనాల కోసం, దోచుకున్న డబ్బును దాచుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా, వేమూరు నియోజకవర్గంలో జరిగే గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొననున్నారన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ నాలుగేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం 40 ఏళ్ల అభివృద్ధిని చేసిందన్నారు. సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందజేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఏడాదిలో పట్టిసీమను పూర్తిచేసి కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసిన ఘనత సీఎంకే దక్కిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, గోవర్ధనరెడ్డిలు అధికారులను బెదిరించడం వారి నైజానికి అద్దం పడుతుందన్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, టీడీపీ నగర అధ్యక్షుడు చందు సాంబశివరావు పాల్గొన్నారు.