ఆంధ్రప్రదేశ్‌

బాధితులకు తక్షణ సహాయం అందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), జూలై 14: తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలంలో గోదావరి నదిలో శనివారం నాటుపడవ బోల్తా పడిన ఘటనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పడవ ప్రమాదం దురదృష్టకరమన్నారు. బాధితులకు తక్షణం సహాక చర్యలు అందించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి పార్టీ తరుపున సహాయక చర్యలో వైకాపా శ్రేణులు పాల్గొనాలన్నారు. బాధితులకు అండగా నిలవాలన్నారు.
రఘువీరా దిగ్భ్రాంతి
తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరిలో పడవ బోల్తా దుర్ఘటనపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి దిగ్భ్రాంతి చెందారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని, సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆయన ప్రభుత్వానికి సూచించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలువాల్సిందిగా ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బాధితులను ఆదుకోవాలి: పవన్
తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలంలో గోదావరి నదిలో నాటుపడవ బోల్తా పడిన దుర్ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పడవబోల్తా ఘటన మనసుని కలచి వేసిందన్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అవసరమైన సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సహాయక చర్యల్లో జనసేన శ్రేణులు కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కొద్ది రోజుల క్రితం జరిగిన వాడపల్లి పడవ ప్రమాదం మరువక ముందే గోదావరి నదిలో ఈ ప్రమాదం జరగటం బాధాకరమన్నారు. జీవితాన్ని పణంగా పెట్టి నాటు పడవల్లో ప్రయాణం చేసే పరిస్థితుల నుండి లంక గ్రామాల ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. సురక్షితమైన, భద్రతా ప్రమాణాలతో కూడిన నది ప్రయాణాన్ని అందుబాటులోనికి తీసుకురావాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నివారణకు పటిష్ఠ చర్యలు
తీసుకోవాలి: సీపీఐ రామకృష్ణ
ఇటీవల రాష్ట్రంలో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలంలో గోదావరి నదిలో నాటుపడవ బోల్తా పడిన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన పలువురు విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గల్లంతయిన వారిని సురక్షితంగా రక్షించాలన్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం, క్షతగ్రాతులకు మెరుగైన వైద్య సహాయక చర్యలు ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. పడవ ప్రమాదాల నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.