ఆంధ్రప్రదేశ్‌

గుజరాత్ తరహాలో బస్ స్టేషన్‌ల ఆధునీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 14: గుజరాత్ రాష్ట్రంలోని వడోదర, తదితర ప్రాంతాల్లో ఇటీవల అభివృద్ధి చేసిన అత్యాధునిక బస్ స్టేషన్‌లు ఆదర్శంగా రాష్ట్రంలోని బస్ స్టేషన్‌లను ఆధునీకరించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే యత్నం చేస్తామని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. తొలి దశలో విజయవాడ, తిరుపతి, విశాఖలకు ప్రాధాన్యత నిస్తామంటునే ఈ ఆధునికరణ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే సాధ్యపడగలదన్నారు. గుజరాత్‌లోని బస్ స్టేషన్‌ల పరిశీలన నిమిత్తం సంస్థ ఇంజనీర్‌లు, అధికారులతో మూడు రోజులపాటు అక్కడ పర్యటించి వచ్చిన రామయ్య శనివారం నాడిక్కడ ఆర్టీసీ భవన్‌లో విలేఖర్లతో మాట్లాడారు. 2016-17కు ముందు దాదాపు రూ. 700 కోట్లుగా ఉన్న నష్టాన్ని అన్ని స్థాయిల్లోని వారు శ్రమించి రూ. 435 కోట్లకు తగ్గిస్తే ఈలోపుగా పెరిగిన డీజిల్ ధరలతో కొత్తగా రూ. 210 కోట్ల భారం పెరిగి తిరిగి నష్టాలు గత స్థాయికే చేరాయన్నారు. డీజిల్ భారం, ఆపై నష్టాలు పెరిగినా ప్రయాణికులపై నయాపైసా అదనపు భారం పడరాదన్నది సీఎం చంద్రబాబు అభిమతంగా రామయ్య చెప్పారు. అక్రమంగా స్టేజీ క్యారేజీగా నడిచే వందలాది ప్రైవేట్ బస్సుల వల్ల ఆర్టీసీకి వచ్చేనష్టం అటుంచి ప్రయాణికులకు సంపూర్ణ భద్రత లేదన్నారు. బస్ స్టేషన్‌ల సమీపాల్లో ప్రైవేట్ బస్సుల కౌంటర్‌లను, అలాగే ప్రైవేటు వాహనాల రాకపోకలను నియంత్రించే శక్తి తమకు లేదని అయితే బ్రోకర్‌లను బస్ స్టేషన్‌లోకి అడుడుపెట్టకుండా మాత్రం చూడగలమన్నారు. కుటుంబ సభ్యులతో వచ్చే ప్రయాణికులు బస్ స్టేషన్‌లలో కాస్తంత సేదదీరేందుకై షాపింగ్ మాల్స్, క్లోక్‌రూంలు, డార్మిటరీలు, ఫుడ్‌కోర్టులు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, త్రిడీ మ్యాపింగ్ లేజర్‌షో, ఆరేడు తెరలతో మినీ థియేటర్‌లు అన్నింటి మించి ఆరోగ్యకరమైన శానిటేషన్ సదుపాయాలతో బస్ స్టేషన్‌లను తీర్చిదిద్దబోతున్నామన్నారు. ఈ సమావేశంలో గుజరాత్‌లో పర్యటించి వచ్చిన సంస్థ ఈఈ శివరామరాజు, ఎంవై దానం ఇతర అధికారులు పాల్గొన్నారు.