ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం సహకరించకపోయినా గాడిన పెట్టాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: సవాళ్లను అధిగమించి సత్వర అభివృద్ధి..సుస్థిర పాలన లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చి సోమవారంతో 15 వందల రోజులు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను శనివారం ఉండవల్లి గ్రీవెన్స్‌హాల్‌లో మీడియాకు వివరించారు. విభజన తరువాత ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో అధికారంలోకి వచ్చి ప్రజల్లో ఒక భరోసా కల్పించామన్నారు. విజ్ఞులైన ప్రజలతో 2022 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఒకటిగా, 2029కి దేశంలో, 2050కి ప్రపంచంలో నెంబర్‌వన్ స్థానంలో నిలిపేవిధంగా ప్రణాళిక రూపొందించామని గుర్తుచేశారు. ఆర్థికాభివృద్ధితో కూడిన హ్యాపీనెస్ అందించాలనే సంకల్పంతో ముందుకు సాగామన్నారు. దీనివల్ల అనూహ్య ఫలితాలను సాధించి ప్రజల్లో సంతృప్తిస్థాయిని పెంచామన్నారు. తాము అధికారం లోకి వచ్చినప్పటి నుంచి పాలనావ్యవస్థను ఫాస్ట్‌ట్రాక్‌లో గాడిలో పెట్టామన్నారు. మొదటి నుంచి కేంద్రం దగాచేసిందని ధ్వజమెత్తారు. రుణమాఫీకి ఒప్పుకోలేదు.. ఆర్బీఐ నిరాకరించింది.. బ్యాంకులు సహకరించలేదు.. పింఛన్లు పెంచితే రెవిన్యూ లోటుతో ముడిపెట్టారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో 10 శాతం వడ్డీతో 50వేల లోపు రుణ విముక్తికి, వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ 24కోట్లు కేటాయించామని డ్వాక్రా సంఘాలకు పెట్టుబడినిధి కింద రూ 10వేలకు గాను 8వేలు చెల్లించామని తెలిపారు. త్వరలో మిగిలిన రెండువేలు వారి ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని ఇందులో భాగంగా 50వేల కోట్లు ఖర్చుపెట్టి 13 ప్రాజెక్టులు చేపట్టామన్నారు. వచ్చే మూడు నెలల్లో మరో 15 ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తామని ఏడాదిన్నర కార్యాచరణతో పెండింగ్ ప్రాజెక్టులన్నింటిలో నీటిని నింపుతామని వెల్లడించారు. మైక్రో ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఇప్పటి వరకు 24లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చామన్నారు. పోలవరం పనులు 57 శాతం పూర్తయ్యాయని చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా 50లక్షల మందికి పింఛన్లు పారదర్శకంగా అందుతున్నాయన్నారు. చంద్రన్న బీమా పథకం కింద 5 నుంచి పదిలక్షల వరకు రైతులకు కూడా వర్తింప చేశామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వంద యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీల ఉన్నతవిద్యకు రూ 10లక్షలు, పెళ్లికానుకగా ఆర్థికసాయం మంజూరవుతోందని వివరించారు. పేదల అకలి దప్పులు తీర్చేందుకు రాష్ట్రంలో మరో వంద అన్న క్యాంటీన్లను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో 28వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లతో వౌలిక వసతులు కల్పించామన్నారు. రానున్న మూడేళ్ల కాలంలో అన్ని గ్రామాల్లో మంచినీటి సరఫరాకు ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరలోగా నూరుశాతం మలమూత్ర విసర్జనరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. డిసెంబర్‌లోగా అన్ని ప్రాంతాలకు ఎల్‌ఈడీ వెలుగులు ప్రసరింప చేస్తామన్నారు. ఇప్పటి వరకు 50వేల కోట్లతో 19లక్షల గృహనిర్మాణాలు చేపట్టామని, మరో ఐదులక్షలు అదనంగా నిర్మించాలనే యోచనతో ప్రభుత్వం ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్.. వేతన సవరణ అమలు..అంగన్‌వాడీ, ఆశాఉద్యోగులు..వీఆర్‌ఏలకు పెంచాం..ఇప్పటి వరకు నాలుగులక్షల మందికి ఇళ్లపట్టాలు అందించాం.. విజయవాడలో త్వరలో మరో 40 వేల మందికి ప్లాట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. రాజధాని భవనాలకు ఆరునెలల్లోనే ఓ రూపు తీసుకు వచ్చామని శాశ్వత భవనాలకు డిజైన్లు తుదిరూపు వచ్చిందన్నారు. కేంద్రం మొండిచేయి చూపడం వల్ల ప్రత్యేకహోదా, మరికొన్ని జాతీయ సంస్థల ఏర్పాటులో అవాంతరాలు ఎదురవుతున్నాయని ఆరోపించారు. అనునిత్యం ఓ విద్యార్థిగా అభివృద్ధి..సంక్షేమాల సమతుల్యత పాటిస్తున్నట్లు తెలిపారు. పేదల ఆరోగ్యభద్రతకు మాల్ న్యూట్రిషన్, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు ప్రవేశపెట్టామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని, సౌరవిద్యుత్‌ను ప్రోత్సహిస్తామన్నారు. ఇందులో భాగంగా ఐదులక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం దిశగా రైతుల్ని జాగృతం చేశామని వివరించారు. ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న గ్రామదర్శిని ద్వారా రోజుకు 2,3 గ్రామాల్లో అధికారులు పర్యటించి ఆర్థికేతర సమస్యలను ముందుగా పరిష్కరించాలన్నారు. జనవరి నుంచి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే దిశగా కార్యాచరణ అమలవుతుందని తెలిపారు. రియల్‌టైమ్ గవర్నెన్స్, ఇతర పద్దతుల ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించటంలో అధికార యంత్రాంగం పనితీరు భేషుగ్గా ఉందని ముఖ్యమంత్రి ప్రశంసించారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు