ఆంధ్రప్రదేశ్‌

విజయవాడలో ప్రపంచ స్థాయి స్పీడ్‌బోట్ పవర్ రేసింగ్ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(పాతబస్తీ), జూలై 14: కృష్ణానదీ తరంగాలపై ప్రపంచ స్థాయి ఎఫ్ 1 హెచ్2ఓ గ్రాండ్ స్పీడ్ బోటు పవర్ రేసింగ్ పోటీలు జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఎండి హిమాన్షు శుక్లా తెలిపారు. శనివారం విజయవాడ బరంపార్క్‌లోని పున్నమి కాన్ఫరెన్స్ హాలులో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. నవంబర్ 15, 16, 17 తేదీల్లో మూడు రోజుల పాటు స్పీడ్ బోటు రేసులు జరగనున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాలలో జరుగుతున్న ఈ పోటీలు మన దేశంలో విజయవాడలో జరగనున్నాయన్నారు. 15 సంవత్సరాల క్రితం ముంబాయిలో ఇలాంటి పోటీలు జరిగాయని, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో జరుగుతున్నాయన్నారు. అమరావతిని ప్రపంచపటంలో నిలపాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆశయం ఈ పోటీల ద్వారా నెరవేరబోతోందని శుక్లా తెలిపారు. 12 దేశాలకు చెందిన పోటీదారులు 9 టీంలుగా ఈ పోటీలో పాల్గొంటారన్నారు. మొత్తం 400 మంది సభ్యులంటారని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో 50 మంది న్యాయ నిర్ణేతలు ఈ పోటీని పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రతి రోజూ లక్ష మంది ప్రజలు, రెండు వేల మంది విదేశీ పర్యాటకులు ఈ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం ఉందని తెలిపారు. 20 కిలోమీటర్ల పరిధిలో కృష్ణానదిలో 11 ద్వీపాల మధ్య స్పీడ్ బోట్ రేస్ జరుగుతుందన్నారు. పోటీలో పాల్గొనే 9 టీముల్లో అమరావతి టీము కూడా బరిలో దిగనుందని శుక్లా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎఫ్1హెచ్2ఓ సంస్థ ప్రతినిధులతో పర్యాటక శాఖ ట్రైపార్టీ అగ్రిమెంట్ పై సంతకాలు చేసుకుని ఇరువర్గాలు పత్రాలను మార్చుకున్నారు. ఎఫ్1హెచ్2ఓ ఆధ్వర్యంలో ఆరో స్పీడ్ బోట్ రేస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, మహాలక్ష్మీ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో గతంలో ఎఫ్1హెచ్2ఓ సంస్థ నిర్వహించిన స్పీడ్ బోట్ రేసులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విలేఖర్లకు చూపించారు. అనంతరం ఎఫ్1హెచ్2ఓ సంస్థ ప్రతినిధులు స్పీడు బోటు రేసు విధివిధానాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ఎఫ్1హెచ్2ఓ ప్రతినిధి పాల్, మహాలక్ష్మీ సంస్థ సందీప్ పాల్గొన్నారు.