ఆంధ్రప్రదేశ్‌

భారీ వర్షాలకు ఏజెన్సీ గ్రామాలు అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 15: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఉభయ గోదావరి జిల్లాలోని పలు ఏజెన్సీ గ్రామాలు అతలాకుతలమవుతున్నాయి. శనివారం అర్థరాత్రి నుండి మొదలైన వర్షం ఆదివారం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. ఫలితంగా ఏజెన్సీలోని వాగులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని కనే్నరు, పెద్దేరు, మడేరు, సీతపల్లి, పాములేరు, సోకులేరు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భూపతిపాలెం, సూరంపాలెం, ముసిరిమిల్లి, మద్దిగడ్డ జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. పలు ప్రాంతాల్లో వాగులు రోడ్లపై నుండి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాజవొమ్మంగి మండలంలో మడేరు వాగు ప్రమాద స్థాయికి మించి ప్రవహించడంతో చిన్నయ్యపాలెం, కొత్తవీధి, వెలగలపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లిమెట్ల, లబ్బర్తి గ్రామాల మధ్య చినే్నరు ఆర్ అండ్ బి రహదారిపై ప్రవహిస్తుండటంతో రాజవొమ్మంగి-కిండ్ర రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాజవొమ్మంగి శివార్లలో వట్టిగెడ్డ వాగు పొంగి ప్రవహించడంతో వయ్యోడు, బూరుగుపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జడ్డంగి సమీపంలో కొక్కిరిగెడ్డ వాగు, మరోవైపు మడేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే శరభవరం వద్ద మాలకొండమ్మ వాగు పొంగి ప్రవహిస్తోంది. మారేడుమిల్లి మండలం గుజ్జుమామిడివలస, కుండాడ పంచాయతీ ప్రధాన రహదారిలో తాత్కాలిక కల్వర్టు వరద ఉద్ధృతికి కొట్టుకుపోవడంతో ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంగవరం-గోకవరం మార్గంలో జువ్వమ్మకాలువ ఉదయం నుండి ఉద్ధృతంగా ప్రవహిస్తుండంతో రాకపోకలు స్థంభించాయి. ఈ మార్గంలో తిరగాల్సిన ఆర్టీసీ బస్సులు సీతపల్లి మీదుగా నడిచాయి. రాజంపాలెం ఆముదాలబంద మధ్య పెద్దకాలువ ఉద్ధృతంగా ప్రవహించడంతో ఆముదాలబందకు రాకపోకలు నిలిచిపోయాయి.
విఆర్‌పురం మండలంలోని దారపల్లి, తెల్లవారిగూడెం, కుందులూరు, తుష్టివారిగూడెం, అడవి వెంకన్నగూడెం, కారంగూడెం, అన్నవరం వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తెల్లవారిగూడెం వాగు పొంగి రహదారిపై నుంచి వర్షపునీరు ప్రవహిస్తుండటంతో జల్లివారిగూడెం, ములకనపల్లి, గూల్లెటివాడ, కుందులూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధంగా అన్నవరం వద్ద వాగు పొంగి రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండటంతో చింతూరు, విఆర్ పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలం కోనరాజుపేట కాజ్‌వేపైకి వరద నీరు పోటెత్తడంతో ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
తూర్పు ఏజెన్సీకి ముఖద్వారంగా పేర్కొనే గోకవరం గ్రామంలో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. గోకవరం- రాజమహేంద్రవరం ప్రధాన రహదారిలో గుమ్మళ్ళదొడ్డి సమీపంలో భారీ వృక్షం కొమ్మలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం వీరన్నపాలెం, విప్పలపాడు, రెడ్డిగణపవరం, పులిరాముడుగూడెం, కన్నాపురం, కోటరామచంద్రపురం గ్రామాల వద్ద కొండవాగులు, కాలువలు ప్రమాదకరస్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి.
బుట్టాయగూడెం వైపు నుండి రెడ్డిగణపవరం, అంతర్వేదిగూడెం వైపు సుమారు 20గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జల్లేరు, పోగొండ రిజర్వాయర్లకు భారీస్థాయిలో వరదనీరు చేరుకుంటోంది. వేలేరుపాడు మండలంలో పెద్దవాగు, ఎత్తువాగు, టేకుపల్లి వాగు, నేళ్లవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనితో సమీప గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు.

చిత్రం..తూ.గో. జిల్లా కూనవరం మండలం కోనరాజుపేట కాజ్‌వేపై ప్రవహిస్తున్న వరదనీరు