ఆంధ్రప్రదేశ్‌

లంక గ్రామాల రైతులకు వరం పోతార్లంక ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జూలై 15: కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని లంక గ్రామాల రైతులకు పోతార్లంక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వరం కానుందని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం పోతార్లంకలో నిర్మాణం పూర్తి చేసుకున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఆదివారం ఆయన జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్న నేపథ్యంలో ఇరిగేషన్, రెవెన్యూ, డ్రైనేజీ, పంచాయతీరాజ్, పోలీసు, తదితర శాఖల అధికారులతో కలిసి ఆయన ప్రాజెక్టును, సభ జరిగే ప్రదేశాన్ని, అనంతరం జరిగే గ్రామదర్శిని సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ పోతార్లంక లిఫ్ట్ ప్రాజెక్టు ద్వారా ప్రధాన కాల్వలోని నీటిని పంపుల ద్వారా తోడించి ఎత్తు ప్రదేశాల్లోని లంక ప్రాంతాల్లో రైతుల వేలాది ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 50కోట్ల రూపాయల నిధులు వ్యయం చేసిందని తెలిపారు. లంక గ్రామాలు ఎత్తు ప్రదేశాల్లో ఉండటంతో ఆ ప్రాంత రైతులు తమకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని లంక గ్రామాల రైతులకు సాగునీటి కష్టాలు తీరతాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పట్టిసీమ ద్వారా కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాంతానికి గోదావరి నీటిని అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని, రైతుల హృదయాల్లో అపర భగీరథుడిగా నిలిచిపోయారన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా డెల్టా ప్రాంతానికి వచ్చి పోతార్లకం ప్రాజెక్టును సోమవారం ప్రారంభించనుండటం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు తుది పనులను పరిశీలించి, ఉన్నతాధికారులతో చర్చించి కార్యక్రమం విజయవంతమయ్యేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మంత్రి అనందబాబు వెంట రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, తెనాలి డీఎస్పీ ఎం స్నేహిత, ఇరిగేషన్ ఈఈ వెంకటరత్నం, కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మైనేని మురళీకృష్ణ, వేమూరు యార్డు చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరు, అమృతలూరు, చుండూరు మండలాల నుండి భారీగా టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..పోతార్లంక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పరిశీలిస్తున్న మంత్రి నక్కా ఆనందబాబు