ఆంధ్రప్రదేశ్‌

ప్రజలకు మరింత చేరువగా ‘పోలీసు’ సేవలు: డీజీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 9: రాష్ట్రంలో తొలి సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో మాత్రమే సైబర్ క్రైం స్టేషన్ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీకి సంబంధించి సైబర్ కేసులకు హైదరాబాద్‌లోని సైబర్ క్రైం స్టేషన్‌ను వినియోగిస్తూ వచ్చారు. ఇక ఆ అవసరం లేకుండా నవ్యాంధ్రప్రదేశ్‌లోని రాజధాని విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌ను డీజీపీ ఆర్‌పి ఠాకూర్ గురువారం ప్రారంభించారు. నగరంలోని డీజీపీ క్యాంపు కార్యాలయం సమీపంలోని విజయవాడ పోలీసు కమిషనరేట్ ఆవరణలో నిర్మించిన సైబర్ క్రైం పోలీస్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం డీజీపీ మాట్లాడుతూ రానున్న కాలంలో సైబర్ నేరాలు మరింత పెరిగే అవకాశం ఉందని, దీని దృష్ట్యా విజయవాడలో తొలి సైబర్ క్రైం పోలీస్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. మరో వారం రోజుల్లో విశాఖపట్నంలో రెండో సైబర్ క్రైం పోలీసు స్టేషన్ ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా సైబర్ నేరాలను ఛేదించేందుకు కీలకమైన సైబర్ ల్యాబ్‌లను వచ్చే మూడు మాసాల్లోగా రాష్ట్రంలో ఏడు చోట్ల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పోలీసు ప్రధాన కార్యాలయం సమీపంలోని టెక్‌టవర్‌లో హెడ్‌క్వార్టర్స్ ట్రైనింగ్ సెంటర్‌గా ఉండేలా ఒకటి, అదేవిధంగా అనంతపురం పోలీసు ట్రైనింగ్ సెంటర్, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలో మొత్తం ఏడు చోట్ల సైబర్ ల్యాబ్‌లు ఏర్పాటు కానున్నాయన్నారు. నూతనంగా ప్రారంభమైన సైబర్ స్టేషన్ కార్యకలాపాలు పదిరోజుల్లో పూర్తిస్ధాయిలో ప్రారంభమవుతాయన్నారు. ఇటీవల కొత్తగా రిక్రూట్ అయిన సిబ్బందిలో 60శాతం మంది బిటెక్ చదివిన వారు ఉన్నందున ఎంపిక చేసిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి సైబర్ క్రైం విభాగంలో నియమిస్తామని చెప్పారు.విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా విజయవాడ పోలీసు కమిషనరేట్‌కు పోలీసుశాఖ కేటాయించిన 12 ఇంటర్‌సెప్టార్ వాహనాలను డీజీపీ ప్రారంభించారు. వీటితోపాటు ప్రజా సమస్యలను వెంటనే తెలుసుకునేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్- 73289 09090ను ఆయన విడుదల చేశారు. ప్రజల భద్రత కన్నా మరేదేనికీ ప్రాధాన్యత లేదన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఈ వాహనాలు అందుబాటులో ఉంటాయని, అదేవిధంగా ప్రజా సమస్యలను నేరుగా వాట్సాప్ నెంబర్ ద్వారా పోలీసులకు సమాచారం చేరవేయవచ్చని చెప్పారు. ప్రారంభ కార్యక్రమాల్లో పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా, ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ హరీష్‌కుమార్ గుప్తా, సిఐడి అదనపు డీజీ అమిత్‌గార్గ్, కృష్ణాజిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం, విజయవాడ పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పలువురు ఐజిలు, డిఐజిలు పాల్గొన్నారు.

చిత్రం..విజయవాడలో సైబర్ క్రైం స్టేషన్ ప్రారంభిస్తున్న డీజీపీ ఆర్‌పీ ఠాకూర్, తదితరులు