ఆంధ్రప్రదేశ్‌

గోసంరక్షణలో ఇంత అలసత్వమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 6: టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న గో సంరక్షణాశాల నిర్వహణ పనుల్లో టిటిడి అలసత్వం వహిస్తున్నారని, ఈ అంశంపై స్పీకర్‌కు నివేదిక సమర్పిస్తామని శాసనసభల హామీల కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేష్ తెలిపారు. బుధవారం తిరుపతిలోని తుమ్మలగుంట సమీపంలోని శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ నిలయాన్ని కమిటీ బృందం పరిశీలించింది. గోశాలలో గోవులను పరిశీలించారు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పశుజాతులైన హాలీకర్, గిరి, కపిలగోవు, దిమోని, ఒంగోలు ఆవు, పుంగనూరు ఆవులను వారు ప్రత్యేంగా పరిశీలించారు. వాటికి అందిస్తున్న ఆహార, తాగునీరు, ఇతర వౌలిక సదుపాయాలకు సంబంధించి వసతులపై అధికారులను ఆరాతీశారు. ఏనుగులు, గుర్రాల నివాసస్థలాన్ని సందర్శించారు. అనంతరం పద్మావతి అతిథి భవనంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఛైర్మన్ విలేకరులతో మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వరా గో సంరక్షణ పాలనావ్యవహారం, మూల జీవుల రక్షణలో టిటిడి చేపడుతున్న చర్యల పట్ల తమ కమిటీ తీవ్ర అసంతృప్తితో ఉందన్నారు. ఇక్కడ తాము గమనించిన పరిస్థితులను స్పీకర్‌కు నివేదిక అందిస్తామన్నారు. ఆయన ద్వారా గో సంరక్షణకు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలను టిటిడి ఇ ఓకు తెలియజేయడం జరుగుతుందన్నారు. భారత దేశంలో గోవుల సంరక్షంలో జైన్ స్వచ్ఛందసేవా సంస్థ మంచి ఫలితాలను సాధిస్తోందన్నారు. ప్రపంచంలోనే టిటిడి ఒక మంచి ధార్మిక సంస్థగా గుర్తింపుపొంది ఉందని, ఈ మూగ జీవాల సంరక్షణలో కూడా అంతగొప్ప గుర్తింపు తీసుకొచ్చే విధంగా అధికారులు దృష్టిసారించాలని తాము చెప్పడం జరిగిందన్నారు.