ఆంధ్రప్రదేశ్‌

పాదరక్షలపై భగత్‌సింగ్ బొమ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, జూలై 6: వ్యాపారులు వారి ఉత్పత్తులను మార్కెట్‌లోనికి తీసుకువెళ్ళి సొమ్ము చేసుకునే నేపధ్యంలో ఎలాంటి తప్పిదాలు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇటీవల కాలంలో బాలగణేషుని చిత్రాన్ని పాదరక్షలపై ముద్రించి పలు ఆందోళనలకు కారణం కాగా తాజాగా రాజీ కంపెనీపేరుతో మార్కెట్‌లోనికి విడుదల చేసిన పాదరక్షలపై యువకిశోరం సర్దార్ భగత్‌సింగ్ చిత్రాన్ని ముద్రించి యంగ్ ఫర్ ఎవర్ అనే ట్యాగ్‌ను ఉంచారు. ఈవిషయం యువతలో ఆందోళన కలిగిస్తోంది. చేగువీరా, భగత్‌సింగ్ బొమ్మలు, కీచైన్స్, టోపీలు, టీషర్టులు, స్టిక్కర్లు, లాకెట్ల రూపంలో మార్కెట్‌లోనికి రాగా యువత వాటికి ఎంతగానో ఆకర్షితులయ్యారు. బైకులపై కూడా చేగువీరా, భగత్‌సింగ్‌ల బొమ్మలను ముద్రించుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో యువకిశోరం భగత్‌సింగ్ చిత్రం పాదరక్షలపై దర్శనం ఇవ్వడం పట్ల పలు విద్యార్థి సంఘాలు, యువజనసంఘాలు తయారీదారుల చేష్టలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.